☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

టీడీపీ-జనసేన ఫ్రెండ్లీ పోటీ..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం వేడెక్కుతున్న వేళ, అధికార కూటమిలో పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. అమరావతి వేదికగా నేడు జరగనున్న కూటమి ‘సమన్వయ కమిటీ’ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజే సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై ఒక స్పష్టమైన లెక్క తేలిపోతుందా అనే ఉత్కంఠ కూటమి శ్రేణుల్లో నెలకొంది. మున్సిపల్, కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. […] The post టీడీపీ-జనసేన ఫ్రెండ్లీ పోటీ..? appeared first on Telugu Rajyam.
టీడీపీ-జనసేన ఫ్రెండ్లీ పోటీ..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం వేడెక్కుతున్న వేళ, అధికార కూటమిలో పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. అమరావతి వేదికగా నేడు జరగనున్న కూటమి ‘సమన్వయ కమిటీ’ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజే సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై ఒక స్పష్టమైన లెక్క తేలిపోతుందా అనే ఉత్కంఠ కూటమి శ్రేణుల్లో నెలకొంది. మున్సిపల్, కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అగ్రనేతలు చర్చలు జరపనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షాల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ఉండేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ముందే ఒక పక్కా ప్లాన్ వేశారు. జనసేన, బీజేపీలు ఏయే స్థానాల్లో బలంగా ఉన్నాయో, ఎక్కడెక్కడ పోటీ చేయాలనుకుంటున్నారో ఆ వివరాల జాబితాను ఇవ్వాలని టీడీపీ ఇప్పటికే కోరింది. ఈ మేరకు జనసేన, బీజేపీ ప్రతినిధులు సిద్ధం చేసిన నివేదికలపై నేటి కోఆర్డినేషన్ కమిటీ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, జనసేన పార్టీ తమ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మున్సిపల్ ఛైర్మన్ పదవులతో పాటు దాదాపు 50 శాతం కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలను ఆశిస్తోంది. తద్వారా స్థానికంగా పాలనలో సమన్వయం ఉంటుందని భావిస్తోంది. మరోవైపు బీజేపీ వ్యూహం వేరుగా ఉంది. తమ బలం ఉన్న స్థానాలతో పాటు, ఇతర ప్రాంతాలలో కూడా పార్టీని బలోపేతం చేసుకునేందుకు వీలుగా ఛైర్మన్, కార్పొరేటర్ స్థానాలను కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఇప్పటికే సమన్వయ సమావేశాలు పూర్తి కావడంతో నేటి రాష్ట్ర స్థాయి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే, ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్లు సహా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా అధికారికంగా ఖరారు కావలసి ఉంది. దీంతో, నేటి సమావేశంలో స్థానాల సర్దుబాటుపై ప్రాథమిక అవగాహనకు వచ్చినప్పటికీ, అభ్యర్థుల ఎంపిక మరియు ఏ సీటు ఎవరికి అనే దానిపై రిజర్వేషన్లు పూర్తిగా తేలిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకే స్థానం కోసం మిత్రపక్షాల మధ్య గట్టి పోటీ ఉంటే, అక్కడ స్నేహపూర్వక పోటీకి అనుమతించే యోచనలో కూడా అధినేతలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి, నేటి అమరావతి భేటీతో కూటమి స్థానిక సమరానికి సంబంధించి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ బయటకు రానుంది.

The post టీడీపీ-జనసేన ఫ్రెండ్లీ పోటీ..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జ్ఞానేశ్ ను కాపాడాలా, వదలాలా..? మోడీషాకు చుక్కలు..!ఉమ్మడి శ్రీకాకుళంలో దువ్వాడ సైలెంట్ మైండ్ గేమ్..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com