☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..

POVA బ్రాండ్ తన POVA 8 5G స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ కొత్తగా “ప్లాస్మా ఆరెంజ్” కలర్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. జూన్‌లో లాంచ్ అయిన 16-బిట్ వైట్ , టర్మినల్ గ్రీన్ కలర్స్‌తో పాటు ఇప్పుడు ఈ సరికొత్త ఆరెంజ్ కలర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పాత యాంగులర్ డిజైన్‌తోనే వస్తుంది కానీ, ఈ కొత్త కలర్ దీనికి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. ఈ కొత్త ఎడిషన్‌లో ఫోన్ […]
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..

POVA బ్రాండ్ తన POVA 8 5G స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ కొత్తగా “ప్లాస్మా ఆరెంజ్” కలర్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. జూన్‌లో లాంచ్ అయిన 16-బిట్ వైట్ , టర్మినల్ గ్రీన్ కలర్స్‌తో పాటు ఇప్పుడు ఈ సరికొత్త ఆరెంజ్ కలర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పాత యాంగులర్ డిజైన్‌తోనే వస్తుంది కానీ, ఈ కొత్త కలర్ దీనికి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. ఈ కొత్త ఎడిషన్‌లో ఫోన్ ప్రధాన డిజైన్ ఫీచర్లు అన్నీ అలాగే ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ వెనుక భాగంలో ఉండే త్రికోణాకారపు కెమెరా హౌసింగ్ , దాని పక్కనే ఉండే “అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే” దీని ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిన్న సెకండరీ డిస్ప్లే ద్వారా ఇన్‌కమింగ్ నోటిఫికేషన్‌లు, బ్యాటరీ ఛార్జ్ లెవెల్స్, యాక్టివ్ టైమర్‌లను చూసుకోవచ్చు. అంతేకాకుండా.. ఫోన్‌ను బోర్లా వేసినప్పుడు ఇది టేబుల్ క్లాక్‌లా కూడా పనిచేస్తుంది. స్టాండర్డ్ కలర్స్ కంటే కొంచెం భిన్నంగా, ప్రత్యేకంగా కనిపించాలనుకునే యువత కోసం ఈ ప్లాస్మా ఆరెంజ్ కలర్‌ను ప్రత్యేకంగా తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది.

POVA 8 5G ముఖ్యమైన ఫీచర్లు ఇలా ఉన్నాయి.
1. 144Hz రిఫ్రెష్ రేట్, 1080×2344 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.76-అంగుళాల FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్.
2. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 6nm ఆక్టా-కోర్ ప్రాసెసర్
3. 6GB లేదా 8GB LPDDR5X RAM అండ్ 128GB UFS 2.2 స్టోరేజ్.
4. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్.
5. సోనీ LYT-600 సెన్సార్‌తో కూడిన 50MP వెనుక కెమెరా , 13MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా.
6. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR సెన్సార్ అండ్ డాల్బీ అట్మాస్‌తో కూడిన స్పీకర్లు.
7. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్.
8. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన భారీ 8000mAh బ్యాటరీ కలిగి ఉంది.

ధర విషయానికి వస్తే, POVA 8 5G ప్లాస్మా ఆరెంజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. ఇది నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ దుకాణాలలో విక్రయానికి అందుబాటులో ఉంది. వినియోగదారులు ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ లాంచ్ గురించి టెక్నో మొబైల్ ఇండియా సీఈఓ అరిజిత్ తలపాత్ర మాట్లాడుతూ.. ఆరెంజ్ కలర్ ఎప్పుడూ POVA బ్రాండ్‌లో ఒక భాగమని, ప్లాస్మా ఆరెంజ్‌తో ఆ శక్తిని మరింత తాజాగా తీసుకువచ్చామని తెలిపారు. యువత తమ శైలిని , వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడానికి ఈ కొత్త కలర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com