☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

టీజీటెట్ ఫలితాలు విడుదల

TG TET Results 2026: తెలంగాణలో ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌ ఇన్‌-సర్వీస్‌ టీచర్స్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, టీజీటెట్‌ ఛైర్‌పర్సన్‌...
టీజీటెట్ ఫలితాలు విడుదల

TG TET Results 2026: తెలంగాణలో ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌ ఇన్‌-సర్వీస్‌ టీచర్స్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, టీజీటెట్‌ ఛైర్‌పర్సన్‌ శనివారం ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షకు హాజరైన వారిలో 15,749 మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 70.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Read Also :RRB NTPC Answer Key: ఆన్సర్ కీ విడుదల.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి

22,477 మంది పరీక్షకు హాజరు

TG TET Results 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. జులై 21న నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించారు. మూడు విడతల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించారు. మొత్తంగా 70.07 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

పేపర్‌-1లో 68.76 శాతం అర్హత

పేపర్‌-1 పరీక్షకు 4,942 మంది హాజరయ్యారు. వీరిలో 3,398 మంది అర్హత సాధించారు. ఈ పేపర్‌లో 68.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

పేపర్‌-2 గణితం, సైన్స్‌లో 73.60 శాతం

పేపర్‌-2 గణితం, సైన్స్‌ విభాగంలో 9,131 మంది పరీక్ష రాశారు. వీరిలో 6,720 మంది అర్హత సాధించారు. ఈ విభాగంలో 73.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

TG TET Results 2026: పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌లో 67 శాతం

పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌ విభాగంలో 8,404 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 5,631 మంది అర్హత సాధించారు. ఈ విభాగంలో 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలు, మార్కుల వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని మీ-సేవ కేంద్రాల్లోనూ మార్కుల వివరాలను పొందవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Website: https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← CM Chandrababu Naidu : ఏపీలో ఉప్పొంగుతున్న నదులు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. మత్స్యకారులకు శుభవార్త..మార్కెట్లోకి రెనో డస్టర్ హైబ్రిడ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com