☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!

Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ సమావేశం ముగిసింది. సభలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కమిటీ విచారణ చేపట్టింది. తాజాగా కౌశిక్ రెడ్డి సమర్పించిన వివరణ, ఆయన కోరిన అదనపు గడువు, సభా కార్యకలాపాలకు సంబంధించిన ఫుటేజీ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. సమావేశంలో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి కమిటీకి రాసిన లేఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. […]
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!

Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ సమావేశం ముగిసింది. సభలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కమిటీ విచారణ చేపట్టింది. తాజాగా కౌశిక్ రెడ్డి సమర్పించిన వివరణ, ఆయన కోరిన అదనపు గడువు, సభా కార్యకలాపాలకు సంబంధించిన ఫుటేజీ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.

సమావేశంలో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి కమిటీకి రాసిన లేఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. వివరణ ఇవ్వడానికి తనకు ఆరు వారాల గడువు కావాలని కౌశిక్ రెడ్డి గతంలో కమిటీని కోరారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన పూర్తి కార్యకలాపాల వీడియో ఫుటేజీని కూడా అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కౌశిక్ రెడ్డి కోరిన ఆరు వారాల గడువును మరింత పొడిగించాలా? లేదా? అనే అంశంపైనా కమిటీ చర్చించారు. అయితే ఈ అంశంపై బీఆర్‌ఎస్‌కు చెందిన కమిటీ సభ్యులు గడువు ఇవ్వాలని కోరారు. కాకపోతే ఈ అంశంపై తుది నిర్ణయం ఏమిటనేది స్పష్టంగా వెల్లడి కావాల్సి ఉంది.

అసెంబ్లీ ఘటనకు సంబంధించిన మరికొంత సీసీటీవీ ఫుటేజీని ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యులు కోరగా.. అదనపు ఫుటేజీ ఇవ్వడంపై కొంత అభ్యంతరం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఘటనకు సంబంధించిన ఫుటేజీని కమిటీ పరిశీలనకు ఉంచినట్లు సభ్యులు సూచించారు. చివరకు 30వ తేదీకి కమిటి విచారణను వాయిదా వేసింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్‌’ ఇంటర్వెల్‌లో స్పెషల్ ట్రీట్!RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com