☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Cabinet Expansion | పదవి వద్దు.. పైసలే ముద్దు.. క్యాబినెట్‌ పదవులపై ఆశావహుల విముఖత!

Cabinet Expansion | మంత్రి పదవులపై ఆశావహులు ఆశలు వదులుకుంటున్నారా? శాఖలపై పెత్తనమంతా షాడో సీఎంవోదే అని విముఖత వ్యక్తం చేస్తున్నారా? ఈ ఏడాది విస్తరణ ఉండదని అధిష్ఠానం తెగేసి చెప్పిందా? అందుకే ఆశావహుల మూడ్‌ మారిందా?
Cabinet Expansion | పదవి వద్దు.. పైసలే ముద్దు.. క్యాబినెట్‌ పదవులపై ఆశావహుల విముఖత!

Cabinet Expansion | మంత్రి పదవులపై ఆశావహులు ఆశలు వదులుకుంటున్నారా? శాఖలపై పెత్తనమంతా షాడో సీఎంవోదే అని విముఖత వ్యక్తం చేస్తున్నారా? ఈ ఏడాది విస్తరణ ఉండదని అధిష్ఠానం తెగేసి చెప్పిందా? అందుకే ఆశావహుల మూడ్‌ మారిందా?

ఒకవేళ వచ్చే సంవత్సరం ఇచ్చినా, మిగిలేది స్వల్పకాలమే కాబట్టి మంత్రి పదవులతో తమకు ఉపయోగం లేదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? క్యాబినెట్‌ బెర్తుల కంటే భారీ కాంట్రాక్టులే మేలు అనే ఆలోచనతో ఉన్నారా?.. ఈ ప్రశ్నలకు గాంధీ భవన్‌ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌26 (నమస్తే తెలంగాణ): సాధారణంగా మంత్రి పదవి అంటే నేతలకు ఎనలేని ఆశలు, అంతులేని ఆరాటం ఉండటం సహజం. గాంధీభవన్‌ నుంచి ఢిల్లీ దాకా చకర్లు కొట్టడం, అధిష్ఠానం పెద్దల చుట్టూ తిరగడం, క్యాబినెట్‌ బెర్త్‌ల కోసం తీవ్రస్థాయిలో పైరవీలు చేయడం వంటివి నిన్నమొన్నటి వరకు సా గిన రివాజు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మంత్రి పదవుల మీద పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసక్తి చూపడం లేదని ‘కుర్చీలో అధికారం లేనప్పుడు, సొంత శాఖలో కనీసం చిన్న ఫైలు కదిలించే స్వేచ్ఛ కూడా లేనప్పుడు, ఆ హోదా వల్ల ఒరిగేదేమీ ఉండదు’ అని వా రు నిర్వేదంతో ఉన్నట్టు చెప్తున్నారు. నామమాత్ర హోదా కంటే, ఆర్థిక సంక్షోభాలు, అప్పుల ఊబి నుంచి గట్టెకించే భారీ కాంట్రాక్టులు, సివిల్‌ ప్రాజెక్టులు తీసుకోవడానికే ఎక్కువ ఆస క్తి చూపుతున్నట్టు సమాచారం. ముఖ్యనేత ముందు కొందరు ఇదే తరహా ప్రతిపాదనలు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

వాళ్లు కన్ను గీటుతేనే..

శాఖల్లో మంత్రుల పెత్తనం నామమాత్రమ నే అసంతృప్తి పార్టీ వర్గాల్లో ఉన్నది. ఈ మధ్య ఇది తారస్థాయికి చేరిందట. ఏ శాఖలో చూసి నా మంత్రుల ఆదేశాలకు విలువ ఉండటం లేదని, అంతా షాడో సీఎంవో కనుసన్నల్లోనే నడుస్తున్నదనే భావన పాతుకుపోయింది. మంత్రులు సచివాలయంలోని తమ చాంబర్లలో కూర్చుంటున్నా, కీలకమైన విధాన నిర్ణయాలు, రూ.కోట్ల టెండర్లు, ఆర్థిక అనుమతులన్నీ తెరవెనుక ఉన్న కొద్దిమంది బ్యూరోక్రాట్ల ద్వారానే ఖరారవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

రోడ్లు-భవనాలు, నీ టిపారుదల, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పరిశ్రమలు, ఇంధన శా ఖల వంటి కీలక విభాగాల్లో సీఎంకు అత్యంత నమ్మకస్తులైన అధికారులే శాఖాధిపతులుగా కొనసాగడమే ఇందుకు నిదర్శనం అని ఓ నేత చెప్పారు. అనేక విభాగాల్లో మంత్రులను దాటే సి నేరుగా సీఎంవోకే ఫైళ్లు వెళ్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు ఏ చిన్న పని కావాలన్నా షాడో సీఎం వో లేదా ముఖ్యనేత సోదరుల ఆశీస్సులుం టేనే కదులుతాయన్న ప్రచారం జరుగుతుండటంతో, డమ్మీలుగా మిగిలిపోవడం ఎందుకని సీనియర్లు భావిస్తున్నట్టు తెలిసింది.

అంతా అయ్యాక..

ఇప్పుడు పదవి చేపట్టినా, మిగిలి ఉన్న కాలపరిమితి లెకలు కూడా నేతలను ని రాశకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ప్రభు త్వం అధికారంలో కి వచ్చి కీలకమైన సమయం గడిచిపోయింది. కనీసం మరో మూడు నాలుగు నెలల దాకా మంత్రివర్గ విస్తరణ జరిగే సూచనలే లేవని అధిష్టానం తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ ఆ గడువు ముగిశాక క్యాబినెట్‌లోకి తీసుకున్నా, చేతిలో ఉం డేది కేవలం రెండేండ్ల కాలం మాత్రమేనని నే తలు లెకలు వేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఒక మంత్రిగా సంబంధిత శాఖపై పట్టు సాధించి, నిధులు రాబట్టి, క్షేత్రస్థాయిలో పనులు చేయించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి మిగిలేది మహా అయితే ఏడాది మాత్రమేనని భావిస్తున్నట్టు సమాచారం. ఈ స్వల్ప వ్యవధి కోసం కోట్లు ఖర్చు చేసి పైరవీలు చే యడం దండగని భావిస్తున్నట్టు సమాచారం.

పదవిపై ఆశ చచ్చిపోయింది

ఈ పరిణామాల నేపథ్యంలో ఆశావహ నేతలంతా వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా ఓ సీనియర్‌ నేత తీరుకు ఇదే కారణమని చెప్తున్నారు. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తొలినాళ్లలో క్యాబినెట్‌ బెర్త్‌ కోసం తీవ్రస్థాయి లో ప్రయత్నించారు. మొదట్లో బహిరంగంగానే అసంతృప్తి స్వరం వినిపించి, అధినేత నిర్ణయాలకే ఎదురుతిరిగిన సదరు నేత, ఇప్పుడు పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. దీని వెనుక మర్మం ఏందనేది పవర్‌ సరిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రభు త్వం నడుస్తున్న తీరు, సీఎంవోలోనే సర్వాధికారాలు కేంద్రీకృతమైన విధానాన్ని గమనించిన తర్వాతే ఆయనలో మంత్రి పదవిపై ఆశ పూర్తిగా చ చ్చిపోయింద న్న ప్రచారం జోరుగా సా గుతున్నది.

ఒ కవేళ తీవ్ర ఒత్తిడి తెచ్చి మంత్రి పదవి సాధించుకున్నా, సోదరుడికే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నదని, కాబట్టి తాను సాధించేదేమీ ఉండదన్న నిర్వేదంలోకి ఆయన వెళ్లినట్టు చెప్తున్నారు. నామమాత్రపు కుర్చీలో కూర్చుని చేతులు కట్టేసుకునే కంటే, తన వ్యాపారాలు, నియోజకవర్గ వ్యవహారాలు చకబెట్టుకోవడమే ఉత్తమమ న్న భావనతోనే సదరు నేత సైలెంట్‌ అయ్యారని సమాచారం. సినిమారంగం నుంచి వచ్చి, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి గళం విప్పు తూ, గత ఎన్నికల సమయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న ఫైర్‌ బ్రాండ్‌ మహిళా నేత కూడా మంత్రి పదవిపై పూర్తి వైరాగ్యాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.

గతంలో తనకు న్యాయమైన పదవి దకాలంటూ ఢిల్లీ స్థాయి నాయకుల వద్ద ప్రస్తావించినా, ప్రస్తుత పరిస్థితుల్లో ‘అధిష్ఠానం పిలిచి పదవి ఇస్తే తీసుకుంటానే తప్ప, దానికోసం వెంపర్లాడటం, ప్రత్యేకమైన ప్రేమ చూపించడం వంటివి తనవల్ల కావు’ అని తన సన్నిహితుల వద్ద కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. ఇక శాసనమండలిలో సీనియర్లుగా ఉన్న కొందరు ఎమ్మెల్సీలు సైతం క్యాబినెట్‌ బెర్త్‌ల ఆశలను పూర్తిగా పకనపెట్టి, నియోజకవర్గాల్లో పనుల సాధన, తమ అనుకూల వ్యాపార ప్రయోజనాలపైనే దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. అధికారం లేని మంత్రి ప దవి భారమంటూ ఇలా ఒకొకరుగా చేతులెత్తేస్తుండటం పార్టీలోని అంతర్గత అసంతృప్తికి అద్దం పడుతున్నదని భావిస్తున్నారు.

పెద్ద ప్రాజెక్టు ఇవ్వండి

ఉత్తర తెలంగాణకు చెందిన ఓ బడా నేత వేసిన ఎత్తుగడ ఇప్పుడు సంచలనంగా మారినట్టు పవర్‌ సరిళ్లలో చర్చ జరుగుతున్నది. సదరు ప్రజాప్రతినిధి కుటుంబానికి గతంలో రియల్‌ ఎస్టేట్‌, హోటల్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో భారీ వ్యాపారాలు ఉండేవి. ఆ క్రమంలోనే వారి భాగస్వామ్య కంపెనీల పేరిట 9 బ్యాంకుల నుంచి దాదాపు రూ.470 కోట్ల మేర రుణాలు సేకరించారని, ఏండ్ల తరబడి అవి నిరర్థ్ధక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారి దివాలా ట్రిబ్యునల్‌ దాకా వ్యవహారం నడిచిందని గతంలో వార్త వచ్చాయి. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నర వ్యవధిలోనే ఏకంగా రూ.400 కోట్లకుపైగా ఏకమొత్తంగా బ్యాంకులకు చెల్లించి నో-డ్యూస్‌ సర్టిఫికెట్లు పొందడం రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారానికి దారితీసింది. సాధారణ పౌరులు చిన్న గృహ రుణాలు చెల్లించడానికే ఇబ్బందులు పడుతుంటే, దివాలా తీసిన సంస్థల బకాయిలను ఎమ్మెల్యే అయ్యాక అంత వేగంగా ఎలా చెల్లించగలిగారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ పరిణామాలు సృష్టించిన ఆర్థిక ఒత్తిళ్లు, దానికితోడు వ్యక్తిగత అనారోగ్య కారణాలను చూపుతూ సదరు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ముందు వింత ప్రతిపాదన పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. శాఖలపై మంత్రులకే అధికారం లేనప్పుడు తనకు క్యాబినెట్‌ హోదా ఏమాత్రం వద్దని, ఆ బరువు మోసేకంటే తన సమస్యలు తీరేలా నీటిపారుదల, రోడ్లు, లేదా మౌలిక వసతుల కల్పన వంటి భారీ బడ్జెట్‌ విభాగాల్లో విలువైన పనులను తన అనుకూల సంస్థలకు కేటాయిస్తే చాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అధికారం లేని నామమాత్రపు మంత్రి పదవి కన్నా, ఆర్థిక సంక్షోభాన్ని తీర్చే ప్రాజెక్టులే మేలన్న ధోరణి పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధుల్లోనూ అంతర్గతంగా విస్తరిస్తున్నట్టు తెలిసింది. పదవుల కన్నా పైసలే మిన్న అనే వాస్తవికతే అధికార పార్టీలో బహిర్గతమవుతున్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← SIR Notice | సర్‌ నోటీసు వస్తే.. ఇంటికే బీఎల్‌వోలు.. వ్యక్తిగత హాజరు విషయంలో ఈసీ ఊరట!Prohibited Properties | సాగు భూములకు నిషేధిత సెగ.. ప్రభుత్వ తప్పిదానికి రైతుల బలి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com