☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

PM ఆవాస్ పై హౌసింగ్ ఆఫీసర్ల సర్వే..కర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో పర్యటన

PM ఆవాస్ పై హౌసింగ్ ఆఫీసర్ల సర్వే..కర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో పర్యటన
PM ఆవాస్ పై హౌసింగ్ ఆఫీసర్ల సర్వే..కర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో పర్యటన
PM ఆవాస్ పై హౌసింగ్ ఆఫీసర్ల సర్వే..కర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో పర్యటన

హైదరాబాద్‌‌, వెలుగు: పీఎం ఆవాస్‌‌ యోజన(రూరల్‌‌) పథకం అమలుపై తెలంగాణ హౌసింగ్‌‌ అధికారులు ఇతర రాష్ట్రాల్లో సర్వే చేస్తున్నారు. మొత్తం ఐదు బృందాలతో ఉన్నతాధికారులను వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వం పంపింది. ఆయా రాష్ట్రాల్లో పీఎం అవాస్‌‌ యోజన రూరల్‌‌ పథకం కింద ఇళ్లను ఎలా నిర్మిస్తున్నారు, ఎంత ఖర్చవుతోంది, అక్కడి లబ్ధిదారులు, అధికారుల అభిప్రాయాలను తెలంగాణ హౌసింగ్‌‌ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, గుజరాత్‌‌, ఛత్తీస్‌‌గఢ్‌‌, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు పూర్తిచేసిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. హౌసింగ్‌‌ కార్పొరేషన్‌‌ చీఫ్‌‌ ఇంజినీర్‌‌ చైతన్యకుమార్‌‌, సీనియర్‌‌ కన్సల్టెంట్‌‌ ఈశ్వరయ్య, బలరాంతో పాటు జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు హితోబా, తిరుపతిరెడ్డి పర్యటన బృందంలో ఉన్నారు.

తెలంగాణకు 2 లక్షల ఇండ్లు..

పదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పీఎం ఆవాస్‌‌ యోజన(రూరల్‌‌) పథకం కింద ఇటీవల 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూరల్‌‌లో రూ.72 వేలతో పాటు టాయిలెట్ల నిర్మాణానికి, వీబీజీ రామ్‌‌ జీ పథకం కింద సుమారు రూ.30 వేల అదనంగా అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తోంది. ఇందులో కేంద్రం నుంచి రూ.లక్ష రానుండగా.. మిగతా రూ.4 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← హైదరాబాద్లో డోర్డాష్ గ్లోబల్ టెక్ హబ్.. 3 వేల కొత్త ఉద్యోగాలు60 శాతం సైబర్ మోసాలు స్టాక్ ట్రేడింగ్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లోనే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com