☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?

తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై తోటి డాన్సర్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, గత కొంతకాలంగా తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. సుమలత ప్రెసిడెంట్‌గా ఉండాలని కొంతమంది, ఆమె వద్దని రఘు మాస్టర్‌ను కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొంతమంది… ఇలా రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున మీడియాకెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ రఘు మాస్టర్‌కు తమ మద్దతు తెలిపింది. అనేక వాదోపవాదాల అనంతరం, ఈరోజు […]
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?

తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై తోటి డాన్సర్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, గత కొంతకాలంగా తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. సుమలత ప్రెసిడెంట్‌గా ఉండాలని కొంతమంది, ఆమె వద్దని రఘు మాస్టర్‌ను కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొంతమంది… ఇలా రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున మీడియాకెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ రఘు మాస్టర్‌కు తమ మద్దతు తెలిపింది. అనేక వాదోపవాదాల అనంతరం, ఈరోజు ఉదయం వెంకటగిరిలోని ఒక ఫంక్షన్ హాల్‌లో రఘు మాస్టర్ వర్గంతో పాటు సుమలత వర్గాన్ని పిలిచి ఫిల్మ్ ఫెడరేషన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సుమలత ప్రెసిడెంట్‌గా కొనసాగాలని 11 మంది మాత్రమే తమ సమ్మతిని చేతులెత్తి తెలియజేయగా, రఘు మాస్టర్ కావాలని 200 మందికి పైగా చేతులెత్తి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే సుమలత మీద కొంతమంది డాన్సర్లు దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. అనంతరం, ఆమె ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా ముందు తమ వాదన వినిపించేందుకు సిద్ధమై, మీడియాకు సమాచారం కూడా ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో ఆ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేస్తున్నట్లుగా కూడా మీడియాకి సమాచారం ఇచ్చారు. అందుతున్న సమాచారం మేరకు, ఆమె ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు తన వర్గం వారితో కలిసి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె పోలీస్ స్టేషన్ నుంచే నేరుగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com