☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

లోకల్ ఎన్నికలు బోగస్.. ముందే చెప్పిన ఏబీవీ..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పునకు ముందే మాజీ ఐపీఎస్ అధికారి ఆలూరు బాల వెంకటేశ్వరరావు చేసిన విశ్లేషణాత్మక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామంటూ కూటమి ప్రభుత్వం చెబుతున్నవన్నీ కేవలం “గాలి కబుర్లే”నని ఆయన కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నించేలా […] The post లోకల్ ఎన్నికలు బోగస్.. ముందే చెప్పిన ఏబీవీ..! appeared first on Telugu Rajyam.
లోకల్ ఎన్నికలు బోగస్.. ముందే చెప్పిన ఏబీవీ..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పునకు ముందే మాజీ ఐపీఎస్ అధికారి ఆలూరు బాల వెంకటేశ్వరరావు చేసిన విశ్లేషణాత్మక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామంటూ కూటమి ప్రభుత్వం చెబుతున్నవన్నీ కేవలం “గాలి కబుర్లే”నని ఆయన కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నించేలా మారింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి ప్రభుత్వానికి గానీ, అటు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీకి గానీ, ఇటు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి గానీ అస్సలు ఆసక్తి లేదని మాజీ ఐపీఎస్ అధికారి బాల వెంకటేశ్వరరావు నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో హడావుడిగా ప్రకటించిన బీసీల 34 శాతం రిజర్వేషన్ల అంశం ముమ్మాటికీ ‘బోగస్’ అని ఆయన ముందే స్పష్టం చేశారు. కేవలం కోర్టుల్లో నిలబడని రిజర్వేషన్లను తెరపైకి తెచ్చి.. “మాకిన్ని సీట్లు, మీకు అన్ని సీట్లు” అంటూ పైకి కొట్టుకుంటున్నట్లు నటిస్తూ ప్రజలను మోసం చేయడం ఆపాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల డ్రామాలతో ప్రజల దృష్టిని మళ్లించడం ఆపి.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన ప్రజా సమస్యలను పరిష్కరించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన 22A నిబంధనను తక్షణమే రోల్ బ్యాక్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిబంధనల పేరుతో చిక్కుల్లో పడిన ఫ్రీహోల్డ్ భూములను ఎవరిది వారికి తక్షణమే అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పునకు కొద్దిరోజుల ముందే ఓ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభుత్వ విధివిధానాలను, రిజర్వేషన్ల డొల్లతనాన్ని ఈ స్థాయిలో ఎండగట్టడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

The post లోకల్ ఎన్నికలు బోగస్.. ముందే చెప్పిన ఏబీవీ..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← విజయనగరం టీడీపీలో చిన్న శ్రీను లేటెస్ట్ చిచ్చు..!అంతా తెలిసే రిజర్వేషన్ డ్రామా ఆడారా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com