☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఎవరీ పానుగంటి చైతన్య..? లేళ్ల అప్పిరెడ్డి అండతోనే..?

విజయవాడ నగరంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తమ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయులను టార్గెట్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుండాల్లా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ దారుణ కాండను ముందుండి నడిపించిన వారిలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పానుగంటి చైతన్యకు వైసీపీలో […] The post ఎవరీ పానుగంటి చైతన్య..? లేళ్ల అప్పిరెడ్డి అండతోనే..? appeared first on Telugu Rajyam.
ఎవరీ పానుగంటి చైతన్య..? లేళ్ల అప్పిరెడ్డి అండతోనే..?

విజయవాడ నగరంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తమ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయులను టార్గెట్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుండాల్లా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ దారుణ కాండను ముందుండి నడిపించిన వారిలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పానుగంటి చైతన్యకు వైసీపీలో అత్యంత వివాదాస్పదమైన ట్రాక్ రికార్డు ఉంది. గతంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనూ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడి ఘటనలోనూ ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ సీరియస్ కేసుల్లో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ, ఇతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని నిన్నటి ఉపాధ్యాయులపై దాడి ఘటనతో మరోసారి రుజువైంది. ఎన్నో పోలీస్ కేసులు మెడపై వేలాడుతున్నా సరే, నడిరోడ్డుపై పోలీసుల కళ్లెదుటే తిరుగుతూ ఉపాధ్యాయులపై దాడులకు తెగబడటం ఇతని బరితెగింపునకు అద్దం పడుతోంది.

ఇలాంటి పాత నేరస్థుడికి వైసీపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అప్పిరెడ్డికి అత్యంత ప్రధాన అనుచరుడిగా ఉన్న చైతన్యకు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద కూడా మంచి ఇమేజ్ ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ పొలిటికల్ బ్యాకింగ్ చూసుకునే ఇతను చట్టాన్ని, పోలీసులను అస్సలు లెక్కచేయడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో ఇతని అరెస్ట్ సమయంలో కొందరు పోలీసులు ఇతనితో అత్యంత స్నేహపూర్వకంగా కబుర్లు చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మారినా ఇలాంటి రౌడీ మూకాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే శాంతిభద్రతలు మరింత క్షీణిస్తాయని, ఇప్పటికైనా సర్కార్ ఇలాంటి వారిపై కఠినమైన పిడియాక్ట్ లాంటి కేసులు పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి.

The post ఎవరీ పానుగంటి చైతన్య..? లేళ్ల అప్పిరెడ్డి అండతోనే..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఐజీ కాంతి రాణా టాటాకు త్వరలో కీలక బాధ్యతలు..?బెజవాడ రచ్చపై జగన్ సంచలన నిర్ణయం..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com