☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Indiramma Illu | ఇందిరమ్మ ఇల్లు పేరిట సర్కార్‌ దగా.. గూడు చెదిరిన వృద్ధ దంపతులు.. కాంగ్రెస్‌ పాలన గిట్లుంటది!

Indiramma Illu | ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని వృద్ధ దంపతులకు ఓ వైపు ఎమ్మెల్యే మంజూరు పత్రం ఇచ్చారు.. మరోవైపు సర్పంచ్‌ ఆ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు.. సొంతింటి కల నెరవేరుతుందనుకుంటున్న తరుణంలో అధికారులు ఇల్లు మంజూరు కాలేదని చెప్పి వారి ఆశలను అడియాశలు చేశారు.
Indiramma Illu | ఇందిరమ్మ ఇల్లు పేరిట సర్కార్‌ దగా.. గూడు చెదిరిన వృద్ధ దంపతులు.. కాంగ్రెస్‌ పాలన గిట్లుంటది!

Indiramma Illu | చెప్పుకొనే కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్వాకానికి నిదర్శనమీ ఉదంతం! ఇందిరమ్మ ఇల్లు పేరిట ప్రభుత్వం చేసిన దగాతో వృద్ధ దంపతులు నిలువ నీడ కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఆశపెట్టిన సర్కార్‌ ఊరిలోనే ఆర్భాటంగా సభపెట్టి మంజూరు పత్రం అందించింది. సర్పంచ్‌తో ఇంటి నిర్మాణానికి భూమి పూజ కూడా చేయించింది. కొత్తింటి సంతోషంలో శిథిలావస్థకు చేరిన పాత ఇంటిని ఆ దంపతులు కూల్చివేశారు. తీరా ఇప్పుడు ఇల్లే మంజూరు కాలేదని అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 26 : ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని వృద్ధ దంపతులకు ఓ వైపు ఎమ్మెల్యే మంజూరు పత్రం ఇచ్చారు.. మరోవైపు సర్పంచ్‌ ఆ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు.. సొంతింటి కల నెరవేరుతుందనుకుంటున్న తరుణంలో అధికారులు ఇల్లు మంజూరు కాలేదని చెప్పి వారి ఆశలను అడియాశలు చేశారు. ఈ దయనీయ స్థితి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పగూడెంకు చెందిన కొలిపాక వెంకటయ్య, వెంకటమ్మ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. జీవనోపాధికోసం హైదరాబాద్‌కు వెళ్లిన కొడుకు నాలుగేండ్ల క్రితం మృతిచెందాడు. కోడలు రేణుక ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటూ కూలి పనులు చేస్తున్నది. వెంకటయ్య, వెంకటమ్మ రజక వృత్తి చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.

పెంకుటిల్లు శిథిలావస్థకు చేరడంతో ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. జూన్‌లో సర్పంచ్‌, అధికారుల సమక్షంలో ఇప్పగూడెంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొలిపాక వెంకటమ్మ పేరున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ధ్రువీకరణపత్రం అందించారు. ఇల్లు మంజూరైందనే సంతోషంలో శిథిలావస్థకు చేరిన పాతఇంటిని వీరు కూల్చేశారు. కొత్త ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలంలో సర్పంచ్‌ మందపురం రాణి అనిల్‌తో భూమిపూజ చేయించారు.

తీరా పనులు ప్రారంభించే సమయానికి అధికారులు వచ్చి ఇల్లు మంజూరు కాలేదని చెప్పడంతో ఆ దంపతులు దికుతోచని స్థితిలో పడిపోయారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్న ఆశతో ఉన్న పాత ఇంటిని కూలగొట్టుకోవడంతో నిలువ నీడలేక వృద్ధ దంపతులు తమ బంధువుల ఇంటి ముందున్న రేకులషెడ్డులో అద్దెకు ఉంటూ.. వానకు తడుస్తూ చలికి వణుకుతూ జీవనం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

నెల రోజుల్లో పరిష్కరిస్తాం

గ్రామానికి మొత్తం 100 ఇండ్లు వచ్చాయి. ఇందులో 10 వరకు అప్రూవల్‌ కాలేదు. కొలిపాక వెంకటమ్మ కుటుంబంతోపాటు మరో మూడు కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయి. వీరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరగా స్పందించిన ఆయన వెంకటమ్మకు ఇల్లు మంజూరు పత్రం అందించారు. ఆన్‌లైన్‌లో వీరి ఫొటో అప్‌లోడ్‌ చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నెల రోజుల్లోగా సమస్యను పరిష్కరించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తాం.

– మందపురం రాణిఅనిల్‌, ఇప్పగూడెం సర్పంచ్‌

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Revanth Reddy | 3నెలలకో కమిటీ.. సర్కారుకేదీ క్లారిటీ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్‌ డ్రామాFarmers | రైతుకు జడిసి.. నీటిని విడిచి.. ఎట్టకేలకు ‘అన్నపూర్ణ’లో ఎత్తిపోతలు షురూ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com