☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

‘మాజీ సర్పంచ్ భర్తతో ప్రాణహాని’

మాజీ సర్పంచ్ భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని సింగరేణి మండల బజ్జాతండ ప్రస్తుత సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు ఆరోపించారు. మండల కేంద్రంలో గ్రామ పెద్దలతో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచుగా గెలిచినప్పటి నుండి...
‘మాజీ సర్పంచ్ భర్తతో ప్రాణహాని’

– రక్షణ కల్పించాలని బజ్జాతండ సర్పంచ్ వేడుకోలు

కారేపల్లి, సెప్టెంబర్ 25 : మాజీ సర్పంచ్ భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని సింగరేణి మండల బజ్జాతండ ప్రస్తుత సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు ఆరోపించారు. మండల కేంద్రంలో గ్రామ పెద్దలతో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచుగా గెలిచినప్పటి నుండి ఏడాది కాలంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సర్పంచ్‌గా తన గెలుపు, రాజకీయ విభేదాలు, గ్రామ పంచాయతీ ప్రజల ఆదరణ నేపథ్యంలో తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురవుతున్నాయని తెలిపారు. మాజీ సర్పంచ్ భర్త బానోత్ రాందాస్ తో పాటు అతడి అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే అందుకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని సర్పంచ్ తెలిపారు.

తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అధికారులు, పోలీసులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ఎదురవుతున్న పరిస్థితులపై సర్పంచ్ భార్య వాంకుడు విజయ పోలీసుల‌కు, అదేవిధంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో గ్రామస్తులు అజ్మీర్ హేమల నాయక్, అజ్మీర నరేన్, వాంకుడోత్ గన్యా, అజ్మీర రవి, అజ్మీర కిషోర్ నాయక్, శంకర్, అజ్మీర సామ్య పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Nepal | ఉప్పొంగుతున్న బాగ‌మ‌తి న‌ది.. పొంచి ఉన్న వ‌ర‌ద ముప్పు.. నేపాల్‌లో మ‌రోసారి హై అల‌ర్ట్SK 27 | ‘పార్కింగ్’ దర్శకుడితో శివకార్తికేయన్ కొత్త సినిమా.. పూజా కార్యక్రమాలతో లాంఛ్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com