☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Tamil Nadu YouTuber Gold Theft : కొంప ముంచిన రీల్స్.. లబోదిబోమంటున్న మహిళా యూట్యూబర్‌.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు..

Tamil Nadu YouTuber Gold Theft : తమిళనాడులో ఓ మహిళా యూట్యూబర్ ఇంట్లో జరిగిన ఓ చోరీ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Tamil Nadu YouTuber Gold Theft : కొంప ముంచిన రీల్స్.. లబోదిబోమంటున్న మహిళా యూట్యూబర్‌.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు..

Tamil Nadu YouTuber Gold Theft : తమిళనాడులో జరిగిన ఓ చోరీ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డబ్బు కట్టలు, భారీగా బంగారు ఆభరణాలు ధరించి ఓ యూట్యూబర్ చేసిన రీల్స్ ఆమె ఇంటికే కన్నం పడేలా చేశాయి. యూట్యూబ్ లో ఆమె చేసిన వీడియోను చూసిన దొంగలు.. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఎంచుకుని వెనుక తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించి భారీ మొత్తంలో బంగారం, నగదుతో పరారయ్యారు.

Also Read : Priyanka Jain : గుర్రం ఎక్కిన సీరియ‌ల్ న‌టి.. ప్రియాంక జైన్ ఫోటోలు వైర‌ల్‌..

తమిళనాడులోని కన్నియాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తుమ్మత్తుకోణంకి చెందిన వినోద్ కుమార్ వ్యాపారవేత్త. ఆయన సతీమణి మధుమిత యూట్యూబర్. తాను కొనుగోలు చేసే బంగారు నగలు, ఇంట్లో ఉండే డబ్బు కట్టలను చూపుతూ, తాను ఎక్కడెక్కడికి వెళ్తుందో చెబుతూ రీల్స్‌ చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. అలా చేయడమే ఆమె కొంపముంచింది.

వినోద్ కుమార్, మధుమిత గురువారం తిరునెల్వేలి వెళ్లి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి వెనుకవైపు తలుపులకు తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోని బీరువాలో తనిఖీ చేయగా.. అందులో ఉంచిన 120 సవర్ల బంగారు నగలు, రూ.50వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీపై సమాచారం అందుకున్న రాజాక్కమంగళం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంటితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగలు ఏ మార్గంలో వచ్చారు? చోరీ అనంతరం ఎటువైపు వెళ్లారు? వారి కదలికలు ఎక్కడైనా కెమెరాల్లో రికార్డయ్యాయా? అనే అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

మధుమిత సోషల్ మీడియాలో బంగారు ఆభరణాలు, నగదు కట్టలను ప్రదర్శిస్తూ పలు వీడియోలు పోస్టు చేశారు. పూజా గదిలో, ఇంట్లో నగదు, బంగారం చూపించడం.. చిన్నారిపై నోట్లను చల్లడం వంటి దృశ్యాలు కూడా వీడియోల్లో ఉన్నాయి. అంతేకాదు.. ఆమె కుటుంబం ఎక్కడికి వెళ్లేంది.. బంగారం కొనుగోలు చేస్తున్న వియాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ వచ్చారు. ఆమె వీడియోలను ఫాలో అయిన గుర్తుతెలియని వ్యక్తులు వారి కుటుంబం ఇంట్లోలేని సమయంలో ఇంట్లోకి దూరి బంగారం, నగదు దోపిడీ చేసుకొని వెళ్లిపోయారు.

ఈ ఘటనతో సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే విషయంలో జాగ్రత్త అవసరమనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదు, బంగారం వంటి వివరాలతోపాటు ప్రస్తుతం ఇంట్లో లేమని తెలిపే ప్రయాణ అప్‌డేట్లు కూడా భద్రతకు సంబంధించిన సమాచారంగా మారే అవకాశం ఉంటుంది.

అందుకే రీల్స్, స్టేటస్‌లు, పోస్టుల్లో వ్యక్తిగత వివరాలను పంచుకునే ముందు వాటి వల్ల కలిగే భద్రతా ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Khairatabad By-Election : బీఆర్ఎస్‌కు ఇజ్జత్‌ కా సవాల్‌గా ఖైరతాబాద్ బైపోల్.. అభ్యర్థిగా అతనేనా?Satya Master : ఇంటి స‌మ‌స్య బ‌య‌ట‌ప‌డింది.. అందుకే మేం మాట్లాడుతున్నాం.. స‌త్య మాస్ట‌ర్ కామెంట్స్‌.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com