☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Pradeep Advaitham: ‘ఛాంపియన్’ దర్శకుడి ఇంట తీవ్ర విషాదం.. చిన్న వయసులోనే భార్య హఠాన్మరణం.. ఏమైందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఛాంపియన్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు అద్వైతం ప్రదీప్ సతీమణి దీప్తి రెడ్డి మాడుగుల హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో దర్శకుడి కుటుంబంలో తీవ్ర విషాధ చాయలు అలుముకున్నాయి.
Pradeep Advaitham: ‘ఛాంపియన్’ దర్శకుడి ఇంట తీవ్ర విషాదం.. చిన్న వయసులోనే భార్య హఠాన్మరణం.. ఏమైందంటే?

ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, ప్రముఖ వ్యాపార వేత్త దీప్తి రెడ్డి మాడుగుల హఠాత్తుగా కన్నుమూశారు. . గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోన్న ఆమె శనివారం (సెప్టెంబర్ 27) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో దర్శకుడి తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు దీప్తి రెడ్డి హఠాన్మరణంతో సినీ, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ నివాళి అర్పిస్తున్నారు.
కాగా ఐదు రోజుల క్రితం దీప్తి రెడ్డి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో నిపుణులైన వైద్య బృందం అత్యవసర శస్త్ర చికిత్స అందించి ఆమె ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. శనివారం సాయంత్రం దీప్తి తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీప్తి రెడ్డి అకాల మరణంతో ప్రదీప్ అద్వైతంతో పాటు వారి ఇద్దరు పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు ప్రదీప్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అద్వైతం ప్రదీప్ విషయానికి వస్తే.. కెరీర్ ప్రారంభంలో ఆయన తెరకెక్కించిన ‘అద్వైతం’ షార్ట్ ఫిల్మ్ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ గుర్తింపుతోనే ‘ప్రదీప్ అద్వైతం’గా స్థిరపడ్డారు. ఇక ‘బిల్లా రంగా’, ‘మైనే ప్యార్ కియా’ వంటి సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పైనా సత్తా చాటారు ప్రదీప్ రెడ్డి. ముఖ్యంగా వైజయంతీ మూవీస్ వంటి అగ్ర సంస్థలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో ప్రదీప్ తెరకెక్కించిన ఛాంపియన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పీరియాడికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ప్రదీప్ భార్య దీప్తి రెడ్డి వ్యాపార రంగంలో సత్తా చాటుతూ విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఆదివారం (సెప్టెంబర్ 27) హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో ఆదివారం దీప్తి రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

⬇ Full News JPG⬇ Short News JPG
← యూపీఐ మార్కెట్‌లోకి యాపిల్ అడుగు.. ఐఫోన్ యూజర్ల కోసం కొత్త పేమెంట్ సదుపాయం!ఆమెకు మంచి భర్త, ఇద్దరు బిడ్డలు.. కట్ చేస్తే, డెలివరీ బాయ్‌తో ఎఫైర్.. చివరకు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com