☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల!

Vrushakarma Movie: యువ సామ్రాట్ నాగ చైతన్య మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వేగంగా సిద్ధమవుతోంది. ‘విరూపాక్ష’ వంటి సంచలన చిత్రం తర్వాత కార్తీక్...
ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల!

Vrushakarma Movie: యువ సామ్రాట్ నాగ చైతన్య మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వేగంగా సిద్ధమవుతోంది. ‘విరూపాక్ష’ వంటి సంచలన చిత్రం తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ సర్వీసెస్ (SVCC), సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభూతిని అందించబోతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా, తాజాగా మరోసారి రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు.

Read Also: Ramayana Trailer Launch: ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణ

Vrushakarma Movie
Naga Chaitanya as a treasure hunter… New poster for ‘Vrushakarma’ released!

Vrushakarma Movie: 50 రోజుల కౌంట్‌డౌన్.. స్టైలిష్ యాక్షన్ పోస్టర్

‘వృషకర్మ’ సినిమా విడుదలకు సరిగ్గా 50 రోజులు మాత్రమే ఉండటంతో.. మేకర్స్ కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తూ ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగ చైతన్య స్టైలిష్‌ యాక్షన్‌ అవతార్‌లో, అత్యంత ఇంటెన్స్ లుక్‌లో అదరగొట్టారు. ఆయన వెనుక భాగంలో దుమ్ము మేఘాలు, గాల్లో ఎగురుతున్న రాళ్లు, తుఫాను వాతావరణాన్ని తలపించే ప్రకృతి దృశ్యాలు సినిమాలోని అడ్వెంచర్ నేపథ్యాన్ని కళ్లకు కడుతున్నాయి.

మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్, యాక్షన్‌ కలగలిపిన సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్.. అగ్ర సాంకేతిక నిపుణులు

నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో పాటు అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా ‘వృషకర్మ’ నిలిచింది. ఈ చిత్రానికి రాగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, త్వరలోనే మేకర్స్ భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Uttarakhand : కన్నీరు పెట్టుకున్న మహిళా మంత్రి.. భర్తపై కేసు.. కొద్ది గంటలకే అనారోగ్యంతో ఆస్పత్రికిభారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com