☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పితృ పక్షం 2026 : శ్రాద్ధం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? పాటించాల్సిన నియమాలివే!

హిందూ సంప్రదాయంలో పిత పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని శ్రాద్ధ పక్షం అని కూడా పిలుస్తారు. 16 రోజుల పవిత్ర సమయంలో శ్రాద్ధం, తర్పణం, పిండ దానం చేయడం దాన ధర్మాలు చేయడం చేస్తుంటారు. దీని వలన పితృదేవతలు ఆనందంగా ఉండటమే కాకుండా దోషాలు కూడా తొలిగిపోతాయి అంటారు. కాగా, ఇప్పుడు మనం పితృపక్షం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.
పితృ పక్షం 2026 : శ్రాద్ధం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? పాటించాల్సిన నియమాలివే!
Pitru Paksha 1

హిందూ సంప్రదాయంలో పితృ పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని శ్రాద్ధ పక్షం అని కూడా పిలుస్తారు. 16 రోజుల పవిత్ర సమయంలో శ్రాద్ధం, తర్పణం, పిండ దానం చేయడం దాన ధర్మాలు చేయడం చేస్తుంటారు. దీని వలన పితృదేవతలు ఆనందంగా ఉండటమే కాకుండా దోషాలు కూడా తొలిగిపోతాయి అంటారు. కాగా, ఇప్పుడు మనం పితృపక్షం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.

Pitru Paksha 2

ఈ సమయంలో అక్టోబర్ 10న వచ్చే అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజున పూర్వీకులకు పితృతర్పణం ఇస్తుంటారు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు పూర్వీకుల మరణంతో ముడిపడి ఉన్న చంద్ర తేదీ ప్రకారం వ్యక్తిగత శ్రాద్ధ కర్మలను సాంప్రదాయకంగా పాటిస్తారు. అయితే ఈ పిత పక్షం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ పనులు చేయడం వలన పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం,

Pitru Paksha 3

ఈ సమయంలో సంప్రదాయ పద్ధతిలో పూర్వీకులకు తర్పణాలు చేయడం చాలా మంచిది. అంతే కాకుండా కుటుంబాల చరిత్ర, ఆచారాల ప్రకారం శ్రాద్ధం , పిండ ప్రధానం చేయాలి. అంతే కాకుండా ఈ పవిత్ర సమయంలో అన్నదానం చేయడం వలన కూడా మేలు జరుగుతుందంట. ముఖ్యంగా ఆచారాల్లో భాగంగా, బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, జంతువులకు, పక్షులకు ఆహారాలు సమర్పించడం చాలా మంచిదంట.

Pitru Paksha 4

ఇక ఈ సమయంలో అస్సలే కొన్ని రకాల పనులు చేయకూడదు అంటున్నారు పండితులు. అవి , ఈ సమయంలో మాసం, మద్యం సేవించడం అస్సలే మంచిది కాదంట. కొంత మంది సంప్రదాయాల ప్రకారం వెల్లులిని కూడా నిషేధిస్తారు. ఈ సమయం శుభకార్యాలకు కూడా అంత మంచిది కాదు. పితృపక్షంలో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు జరపడం, ఇతర శుభకార్యాలు చేయడం మంచిది కాదు అంటున్నారు పండితులు.

Pitru Paksha 5

అలాగే శ్రాద్ధ పక్షంలో జుట్టును కత్తిరించడం, గోళ్లు కట్ చేయడం, కుటుంబ సభ్యులతో వాదనలు పెట్టుకోవడం పెద్దవారిని అగౌరవ పరచడం వంటి పనులు కూడా అస్సలే చేయకూడదంట. అంతేకాకుండా పూర్వీకులను అవమానించకూడదు, చిత్తశుద్ధితో మరణించినవారికి పితృతర్పణంచేయాలి.

⬇ Full News JPG⬇ Short News JPG
← చట్టాల నుంచి జవాబుదారీతనం వరకు.. దేశ పాలనలో పార్లమెంటు పాత్ర ఏంటి?భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకోండి..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మర్చిపోరు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com