☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Smit Machchhar: ఫ్లైదుబాయ్ పైల‌ట్ ఓ హీరో.. ప్ర‌శంసించిన ట్రంప్‌, మోదీ, నెత‌న్య‌హూ

Smit Machchhar: ఫ్లైదుబాయ్ పైల‌ట్ స్మిత్ మ‌చ్చ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ట్రంప్‌, మోదీ, నెత‌న్య‌హూ ఆ పైల‌ట్‌ను హీరోగా పోల్చారు. 174 మందితో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో పైల‌ట్‌పై కోపైల‌ట్ క‌త్తితో దాడి చేసి ఆ విమానాన్ని కూల్చే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే.
Smit Machchhar: ఫ్లైదుబాయ్ పైల‌ట్ ఓ హీరో.. ప్ర‌శంసించిన ట్రంప్‌, మోదీ, నెత‌న్య‌హూ

వాషింగ్ట‌న్ : ఫ్లైదుబాయ్ పైల‌ట్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానం కాక్‌పిట్‌లో పైల‌ట్‌పై కోపైల‌ట్ క‌త్తితో దాడి చేశాడు. అయితే విమానం హైజాక్‌ను పైల‌ట్ అడ్డుకున్న‌ట్లు తెలుస్తోంది. ఫ్లైదుబాయ్ పైల‌ట్‌ను స్మిత్ మ‌చ్చ‌ర్‌(Smit Machchhar)గా గుర్తించారు. భార‌త జాతీయుడైన మ‌చ్చ‌ర్ చూపిన తెగువ‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. అత‌న్ని హీరోగా పోల్చారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌. ఓవ‌ల్ ఆఫీసులో రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడిన ట్రంప్‌.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్య‌హూతో ఈ అంశం గురించి మాట్లాడిన‌ట్లు చెప్పారు. భార‌త ప్ర‌ధాని మోదీ, ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్య‌హూ కూడా పైల‌ట్ మ‌చ్చ‌ర్ సాహసాన్ని కొనియాడారు.

బ‌హుశా ఆ పైల‌ట్ ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉండి ఉంటుంద‌ని, కానీ అత‌ను చూపిన తెగువ అద్భుత‌మ‌ని, అత‌నో హీరో అంటూ ట్రంప్ పేర్కొన్నారు. పైల‌ట్ త‌న కాక్‌పిట్ డోర్‌ను తెరిచి, ప్ర‌యాణికుల నుంచి స‌హాయం కోరాడ‌ని, బ‌హుశా ఆ కోపైల‌ట్ ఉగ్ర‌వాది అయి ఉంటాడ‌ని ట్రంప్ అన్నారు. ఓ ఇజ్రాయిలీ ప్యాసింజ‌ర్ ర‌క్త‌సిక్త‌మైన పైల‌ట్ మ‌చ్చ‌ర్‌ను కాపాడిన‌ట్లు ట్రంప్ తెలిపారు. పైల‌ట్‌పై దాడి జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో 174 మంది ఉన్నారు. పైల‌ట్‌పై క‌త్తిపోటు ఘ‌ట‌న త‌ర్వాత విమానం కేవ‌లం 30 సెక‌న్ల‌లో దాదాపు 14వేల ఫీట్లు కింద‌కు దిగింది.

సౌదీ అరేబియాలోని త‌బుక్‌లో ఆ విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైల‌ట్‌ను క‌త్తితో పొడిచిన కోపైల‌ట్ .. ఆ విమానాన్ని కూల్చేందుకు కుట్ర‌ప‌న్నాడ‌ని ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్య‌హూ తెలిపారు. ప్ర‌స్తుతం త‌బుక్ ఆస్ప‌త్రిలో పైల‌ట్ మ‌చ్చ‌ర్ చికిత్స పొందుతున్నాడు. అత‌ని ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ది. పైల‌ట్ మ‌చ్చ‌ర్ కాక్‌పిట్‌లో ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్నాడు. అయితే అత‌ను కాక్‌పిట్ రిలీజ్ అయ్యే బ‌ట‌న్ నొక్క‌డంతో.. ప్ర‌యాణికులు వ‌చ్చి కోపైల‌ట్‌ను నియంత్రించారు. ఇక ఆ విమానంలో ఉన్న ఫ్లైదుబాయ్ సెకండ్ పెయిర్ పైల‌ట్లు.. విమానాన్ని త‌బుక్‌లో దించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్ర‌వేశాల‌ గడువు 13 వరకు పొడిగింపుGST Collections | సెప్టెంబ‌ర్‌లో భారీగా జీఎస్టీ వ‌సూళ్లు.. వ‌రుస‌గా మూడో నెల‌లో రూ.2 ల‌క్ష‌ల కోట్ల‌కు పైనే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com