☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Donald Trum: మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల త‌ర్వాత ఇరాన్‌పై మ‌ళ్లీ దాడులు !

Donald Trum: హోర్ముజ్ జ‌ల‌సంధిపై ఇరాన్ తాజాగా ఏడు రోజుల శాంతి ప్ర‌తిపాద‌న చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్ర‌తిపాద‌న‌ను అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్య‌తిరేకించిన‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్‌లో జ‌రిగే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఇరాన్‌పై దాడులు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు.
Donald Trum: మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల త‌ర్వాత ఇరాన్‌పై మ‌ళ్లీ దాడులు !

న్యూయార్క్‌: హోర్ముజ్ జ‌ల‌సంధి రీఓపెనింగ్ అంశంపై ఇరాన్ తాజాగా ఏడు రోజుల శాంతి ప్ర‌తిపాద‌న చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్ర‌తిపాద‌న‌ను అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trum) వ్య‌తిరేకించిన‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్‌లో జ‌రిగే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఇరాన్‌పై దాడులు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. అయితే ఆ వ్యాఖ్య‌ల‌కు చెందిన రిపోర్టును వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ రాసింది. ఖ‌తార్ మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా అమెరికాకు త‌మ శాంతి ప్ర‌ణాళిక తెలియ‌జేసిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌సంగంలో ఇరాన్ మంత్రి అబ్బాస్ అర‌గాచీ తెలిపారు. ఏడు రోజ‌ల శాంతి ఒప్పందం త‌ర్వాత హోర్ముజ్‌ను తెరుస్తామ‌ని, ఆ త‌ర్వాత ప్రాంతీయ పోరాటం ఆగుతుంద‌ని మంత్రి అర‌గాచీ త‌న ప్ర‌తిపాద‌న‌లో పేర్కొన్నారు. ఒక‌వేళ అమెరికా ఆ ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్ప‌క‌పోయినా, తాము ఆ ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు అర‌గాచీ చెప్పారు. ఒక‌వైపు అమెరికా, ఇరాన్ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా.. ట్రంప్ మాత్రం మ‌ళ్లీ దాడుల‌కు ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంద‌ని రిపోర్టులో రాశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Fahadh Faasil | ఫహాద్ ఫాజిల్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై పెరుగుతున్న ఆసక్తి!విద్యార్థినులతో గవర్నమెంట్ టీచర్ కీచక చేష్టలు.. ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com