☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

ట్యాంక్ బండ్ వద్ద డీజేలు బంద్

Tank Bund DJ restrictions:ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో డీజే సౌండ్ సిస్టంలపై కఠిన ఆంక్షలు విధిస్తూ సైఫాబాద్ ఏసీపీ సంజయ్...
ట్యాంక్ బండ్ వద్ద డీజేలు బంద్

Tank Bund DJ restrictions:ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో డీజే సౌండ్ సిస్టంలపై కఠిన ఆంక్షలు విధిస్తూ సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో డీజేలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఎలాంటి పరిస్థితుల్లోనూ డీజేలను అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read also: Ganesh Procession Accident: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం.. ట్రక్ కింద పడి యువకుడు మృతి!

Ban on DJs at Tank Bund
Ban on DJs at Tank Bund

పోలీసుల కమ్యూనికేషన్ కోసమే ఈ నిబంధన

భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ నియంత్రణ సమయంలో పోలీసుల కమ్యూనికేషన్‌కు డీజేల శబ్దం తీవ్ర అంతరాయం కలిగిస్తోందని ఏసీపీ సంజయ్ కుమార్ వివరించారు. ఏ పార్టీ పాటలనే దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం అధిక శబ్దం వల్ల విధులకు కలుగుతున్న ఆటంకమే ప్రధాన సమస్యని ఆయన స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది సమన్వయం కోసం ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని సూచించారు.

Tank Bund DJ restrictions:నియమాలు పాటించాలని విజ్ఞప్తి

నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా సాగేందుకు ప్రజలు, యువకులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించి డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అందరూ బాధ్యతగా వ్యవహరించి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఖైరతాబాద్ గణేశుడి భారీ వాహనం నడిపేది ఎవరో తెలుసా? 26 ఏళ్లుగా డ్రైవర్‌గా..రెండు రోజులు పాటు భారీ వర్ష సూచన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com