☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

చంద్రబాబును మెప్పించిన ఎన్నారై ఎమ్మెల్యే..?

రాజకీయాల్లో నాయకత్వానికి అసలైన పరీక్ష ప్రజాక్షేత్రంలోనే ఎదురవుతుంది. ఆ పరీక్షను సమర్థవంతంగా ఎదుర్కొని, తనపై ఉన్న అపోహలను పటాపంచలు చేశారు ఉదయగిరి కూటమి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. గత కొంతకాలంగా నియోజకవర్గ పరిణామాలు, కొందరు నేతలు చేరవేసిన చాడీల వల్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా సాగింది. ఒకానొక సందర్భంలో సీఎం బహిరంగంగానే మందలించడంతో కాకర్ల రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ, […] The post చంద్రబాబును మెప్పించిన ఎన్నారై ఎమ్మెల్యే..? appeared first on Telugu Rajyam.
చంద్రబాబును మెప్పించిన ఎన్నారై ఎమ్మెల్యే..?

రాజకీయాల్లో నాయకత్వానికి అసలైన పరీక్ష ప్రజాక్షేత్రంలోనే ఎదురవుతుంది. ఆ పరీక్షను సమర్థవంతంగా ఎదుర్కొని, తనపై ఉన్న అపోహలను పటాపంచలు చేశారు ఉదయగిరి కూటమి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. గత కొంతకాలంగా నియోజకవర్గ పరిణామాలు, కొందరు నేతలు చేరవేసిన చాడీల వల్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా సాగింది. ఒకానొక సందర్భంలో సీఎం బహిరంగంగానే మందలించడంతో కాకర్ల రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

కానీ, సెప్టెంబర్ 30న ఉదయగిరిలో జరిగిన ‘పల్లె పండుగ’ బహిరంగ సభ కాకర్ల సురేష్ రాజకీయ ప్రస్థానంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సభతో ఆయనకు పట్టిన రాజకీయ గ్రహణం పూర్తిగా వీడిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన అనుచర గణం పడిన శ్రమ, చేసిన జన సమీకరణ అంచనాలను తలకిందులు చేసింది. సభకు పోటెత్తిన జనసందోహాన్ని, నియోజకవర్గ కేడర్‌లో ఉన్న ఉత్సాహాన్ని చూసి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైమరచిపోయారు.

వేదికపైనే కాకర్ల సురేష్‌ను ‘శెబాష్ కాకర్ల’ అంటూ భుజం తట్టి అభినందించకుండా ఉండలేకపోయారు. అధినేతను ప్రసన్నం చేసుకోవడంలో కాకర్ల పడిన కృషి పూర్తిగా ఫలించిందని, ఈ ఒక్క సభతో సీఎం చంద్రబాబు మనసులో కాకర్ల సురేష్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తోంది. అధినేత మెప్పు పొంది సరికొత్త ఉత్సాహంతో ఉన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ఇదే ఊపులో నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులను, క్రియాశీల కార్యకర్తలను కలుపుకుని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరి మనసు గెలుచుకుని, వారిలో తన నాయకత్వం పట్ల మరింత సదభిప్రాయం పెంచుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ తిరుగులేని లీడర్‌గా స్థిరపడటం ఖాయం. ఆ శుభ పరిణామం దిశగానే కాకర్ల అడుగులు పడాలని ఉదయగిరి కూటమి శ్రేణులు ఆశిస్తున్నాయి.

The post చంద్రబాబును మెప్పించిన ఎన్నారై ఎమ్మెల్యే..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← నెల్లూరు మేయర్ కోసం ఎంపీ గారి ఆరాటం..!జాతీయ వేదికలపై జగన్ మౌనం, పార్టీకి నష్టమే..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com