IIT: దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు (IITs) విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కఠిన నిర్ణయం తీసుకున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు ప్రకటించి, ఆ తర్వాత వివిధ కారణాలతో వాటిని ఉపసంహరించుకున్న 22 కంపెనీలపై ఐఐటీలు వేటు వేశాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆయా కంపెనీలపై రాబోయే రెండేళ్లపాటు రిక్రూట్‌మెంట్ పరంగా కఠిన ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి.

150కి పైగా ఆఫర్ల రద్దు – రంగంలోకి ‘ఆల్ ఐఐటీస్ ప్లేస్‌మెంట్ కమిటీ’
రాబోయే 2026 గ్రాడ్యుయేషన్ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు సంబంధించి ఏకంగా 150కి పైగా జాబ్ ఆఫర్లను వివిధ కంపెనీలు సనిమిషంలో రద్దు చేశాయి. విద్యార్థుల కెరీర్‌తో చెలగాటమాడే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణించిన ‘ఆల్ ఐఐటీస్ ప్లేస్‌మెంట్ కమిటీ’ ఈ కఠిన చర్యకు ఉపక్రమించింది. ఈ జాబితాలో ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) సహా మరికొన్ని పేరుమోసిన సంస్థలు కూడా ఉన్నట్లు సమాచారం.
Read also: PF New Rules 2026:పిఎఫ్లో కీలక మార్పు.. ఇక ఉద్యోగుల జీతం నుంచి ఎంత కట్ అవుతుందో తెలుసా?
విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంటేనే విద్యార్థులకు ఎంతో కీలకమైన ఘట్టం. అలాంటి సమయంలో కంపెనీలు ఆఫర్లు ఇచ్చి వెనక్కి తగ్గడం వల్ల విద్యార్థులు మానసికంగా మరియు వృత్తిపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ క్రమశిక్షణా చర్యల ద్వారా ఐఐటీలు తమ విద్యార్థుల ప్రయోజనాలకు పూర్తి భద్రత కల్పిస్తూ, రిక్రూట్మెంట్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా కంపెనీలకు గట్టి హెచ్చరిక పంపాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






