☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అన్ని గాడ్జెట్ లకూ ఒక్కటే ఛార్జర్! జర్నీ చేసేవాళ్ళ దగ్గర తప్పకుండా ఉండాల్సిందే

విదేశాలకు వెళ్లే సమయంలో ఫోన్, ల్యాప్‌టాప్, ఇయర్‌బడ్స్ వంటి గ్యాడ్జెట్లతో పాటు ఛార్జింగ్ అడాప్టర్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి. అయితే దేశం మారితే సాకెట్ రకం కూడా మారిపోతుంది. దీంతో ప్రత్యేక ప్లగ్‌లు లేదా అదనపు అడాప్టర్లు వెంట పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా యూగ్రీన్ కొత్త 65W ట్రావెల్ అడాప్టర్‌ను తీసుకొచ్చింది. ఒక్క ట్విస్ట్‌తోనే ప్లగ్ రకం మారిపోవడం దీని ప్రత్యేకత.
అన్ని గాడ్జెట్ లకూ ఒక్కటే ఛార్జర్! జర్నీ చేసేవాళ్ళ దగ్గర తప్పకుండా ఉండాల్సిందే

ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి చిన్న బ్యాగులోనే ఎక్కువ సామాను సర్దుకోవాల్సి ఉంటుంది. ఛార్జింగ్ కోసం వేర్వేరు ప్లగ్‌లు తీసుకెళ్లడం మరో ఇబ్బంది. ఇప్పుడు ఆ అవసరాన్ని తగ్గించేలా కొత్త ట్రావెల్ అడాప్టర్ అందుబాటులోకి రానుంది. 360 డిగ్రీలు తిరిగే ప్రత్యేక మెకానిజంతో US, UK, యూరప్, ఆస్ట్రేలియా ప్లగ్ టైప్స్‌కు సులభంగా మార్చుకునే వీలుంది. సెప్టెంబర్ 29 నుంచి ఇది చైనాలో అందుబాటులోకి రానుంది.

ఒక్క ట్విస్ట్‌తో..

సాధారణ ట్రావెల్ అడాప్టర్లలో ప్లగ్ మార్చాలంటే స్లైడర్లు తోయడం, విడిభాగాలు అమర్చడం వంటి పనులు ఉంటాయి. కొత్త అడాప్టర్‌లో మాత్రం 360 డిగ్రీలు తిరిగే మెకానిజం ఇచ్చారు. ఒక్కసారి తిప్పితే చాలు.. అవసరమైన ప్లగ్ టైప్‌లోకి మారిపోతుంది. US, UK, యూరప్, ఆస్ట్రేలియా ప్లగ్ టైప్స్‌కు ఇది సరిపోతుంది. దాదాపు 200 పైగా దేశాల్లో ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే ఇందులో రెండు యూఎస్‌బీ-సి, ఒక యూఎస్‌బీ-ఎ పోర్టులు ఉన్నాయి. ఒక యూఎస్‌బీ-సి పోర్ట్‌ను మాత్రమే ఉపయోగిస్తే 65W పవర్ అందుతుంది. దీంతో మేక్‌బుక్ ఎయిర్ వంటి ల్యాప్‌టాప్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు. ఫోన్, ల్యాప్‌టాప్, బడ్స్‌ను ఒకేసారి కనెక్ట్ చేస్తే 65W పవర్ వాటి అవసరానికి అనుగుణంగా పంచబడుతుంది.

GaN (గాలియం నైట్రైడ్) టెక్నాలజీ..

ఈ అడాప్టర్‌లో GaN (గాలియం నైట్రైడ్) టెక్నాలజీని ఉపయోగించారు. దీని వల్ల పరిమాణం చిన్నగా ఉండటంతో పాటు వేడి నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 59% చిన్నగా ఉంటుంది. బరువు కేవలం 158 గ్రాములు కావడం వల్ల ప్రయాణ బ్యాగ్‌లో సులభంగా పెట్టుకోవచ్చు.

మరో ప్రత్యేకత బ్యాలెన్స్‌డ్ గ్రావిటీ డిజైన్. ఎయిర్‌పోర్టులు, హోటళ్లలో వదులుగా ఉన్న సాకెట్లలో పెద్ద ఛార్జర్లు ఊడిపోయే సమస్య ఉంటుంది. ఈ డిజైన్ కారణంగా సాకెట్‌లో అడాప్టర్ గట్టిగా పట్టుకుని ఉండేలా రూపొందించారు. దీని ధర రూ.2,100 వరకు ఉండనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← New Rules Changes: అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా మారే 10 కీలక మార్పులు ఇవే..!ఉప్పు ప్యాకెట్లపై సిగరెట్ తరహా హెచ్చరికలు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com