☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

America-Iran War: మళ్లీ మొదలైన అమెరికా-ఇరాన్ పోరు.. విఫలమైన ఖతార్ రాయబారం.. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!

అమెరికా, ఇరాన్‌(America-Iran War)ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన దౌత్య రాయబార ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి.
America-Iran War: మళ్లీ మొదలైన అమెరికా-ఇరాన్ పోరు.. విఫలమైన ఖతార్ రాయబారం.. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!

America-Iran War: అమెరికా, ఇరాన్‌ల మధ్య గత కొంతకాలంగా పెరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన దౌత్య రాయబార ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి. ఈ వారంలో న్యూయార్క్, వాషింగ్టన్‌‌లలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. ఇరాన్‌పై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేయగా, ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా పరిమితం చేసుకోవాలని అమెరికా పట్టుబట్టింది. ఇరు దేశాలు తమ మొండి వైఖరిని వీడకపోవడంతో ఖతార్ ప్రతిపాదించిన రెండు పేజీల ఒప్పందం ముందుకు సాగలేదు.

Telangana MLC Elections: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌తో తలకిందులైన చర్చల ప్రక్రియ:

ఖతార్ ప్రతినిధి అలీ అల్-థవాదీ వాషింగ్టన్‌లో అమెరికా అధికారులతో చర్చలు జరుపుతున్న సమయంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (America-Iran War)సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సీన్ మార్చేశారు. తాము ఇరాన్‌కు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని ట్రంప్ తేల్చిచెప్పడంతో చర్చలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. దీంతో మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రతినిధులతో పాటు పాకిస్తాన్, ఈజిప్ట్ వంటి ప్రాంతీయ దేశాల ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు మళ్లీ మొదటికొచ్చాయి.

ఇరు దేశాల తీవ్ర హెచ్చరికలు – మళ్లీ ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు:

రెండు దేశాల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ట్రంప్ సరిగ్గా నిర్ణయం తీసుకోలేక ఊబిలో చిక్కుకున్నారని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సిన్ రజాయీ ఎద్దేవా చేయగా, ఇరాన్ త్వరలోనే లొంగిపోతుందని, వారి వద్ద అణు ఆయుధం లేకుండా చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. మిడ్-టర్మ్ ఎన్నికల తర్వాత అమెరికా పెద్ద ఎత్తున సైనిక చర్యలకు దిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో దౌత్య పరిష్కారం దొరకడం కష్టంగా మారి మళ్లీ యుద్ధ మేఘాలు అలముకున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Keerthy Suresh : డోర‌తీ మూవీ వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేశ్Poorna : మెరూన్ క‌ల‌ర్ డ్రెస్‌లో ముద్దుగా.. న‌టి పూర్ణ ఫోటోలు వైర‌ల్‌.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com