☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..

Uttam Kumar Reddy on ECI: ఓటరు జాబితా సవరణల్లో వెలుగు చూసిన అక్రమాలపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మ్యాచ్ ఆడే రిఫరీపైనే అనుమానాలు వ్యక్తమైతే, అది ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఎన్నికల సంఘం స్వతంత్రతే ప్రధాన పునాది అని, ఈ స్వతంత్రత పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి భారతీయ పౌరుడి ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు.
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..

Uttam Kumar Reddy on ECI: ఓటరు జాబితా సవరణల్లో వెలుగు చూసిన అక్రమాలపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మ్యాచ్ ఆడే రిఫరీపైనే అనుమానాలు వ్యక్తమైతే, అది ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఎన్నికల సంఘం స్వతంత్రతే ప్రధాన పునాది అని, ఈ స్వతంత్రత పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి భారతీయ పౌరుడి ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు. ఎన్నికల సంఘం అనేది అధికారంలో ఉన్న బీజేపీ ఆఫీస్ కాదని, అలాగే ఓటరు జాబితా కేంద్ర ప్రభుత్వ సొంత ఆస్తి కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఓటు అనేది అధికార పార్టీ సొత్తు కాదని, అది దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన పరమ పవిత్రమైన హక్కు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే సాధనంగా మార్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. అసలు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని ఎందుకు తొలగించారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. ప్రధాని సూచించిన కేంద్ర మంత్రిని కమిటీలో చేర్చుకుని కమిటీలో బీజేపీ తన మెజారిటీని ఖాయం చేసుకుందని విమర్శించారు. గతంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రతి సందేహం ఈనాడు దేశ ప్రజలందరి ప్రశ్నగా మారిందన్నారు.

ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి లేవనెత్తినట్లు చెప్తున్న 14 కీలక అభ్యంతరాలపై ఎన్నికల సంఘం వెంటనే సమాధానం చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. గోవాలో 97 మంది అర్హులైన పౌరుల పేర్లు తుది ఓటరు జాబితాలో చేరకపోవడం అత్యంత తీవ్రమైన ఆందోళనకర విషయమని అన్నారు. చట్టబద్ధమైన అధికారులు పరిశీలించి అర్హతను నిర్ధారించిన తర్వాత కూడా సాఫ్ట్‌వేర్ సాంకేతికత నెపంతో ఓటు హక్కును అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ గోవా ఘటనకు బాధ్యులెవరో ఎన్నికల సంఘం వెంటనే దేశ ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు. ఓటర్ల సంఖ్య 97 కావచ్చు, లేదా ఒక్కరు కావచ్చు.. సంఖ్య చిన్నదైనంత మాత్రాన రాజ్యాంగం ఇచ్చిన హక్కు చిన్నదైపోదని చెప్పారు. ఒక్క అర్హత కలిగిన పౌరుడి ఓటు హక్కును అడ్డుకున్నా, అది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడేనని స్పష్టం చేశారు. సాంకేతికత అనేది మనుషులకు సేవ చేయడానికి ఉండాలని, కానీ ఆ సాంకేతికత కోసం ప్రజల ఓటు హక్కును బలి ఇవ్వకూడదని హితవు పలికారు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకంగా 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను తొలగించడంపై సంపూర్ణ పారదర్శకత వహించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోనే 22.21 లక్షల మంది తమ ఓటర్ల పేర్ల పునరుద్ధరణ కోసం అప్పీలు చేసుకున్నారంటే అది చిన్న విషయం కాదని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పేర్లను సరిచేస్తే పౌరుడికి దక్కే ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తూ, ఓటింగ్ జరగడానికి ముందే ప్రతి పౌరుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రైలు వెళ్లిపోయిన తర్వాత టికెట్ ఇచ్చినట్లు, ఎన్నికల ప్రక్రియ అంతా ముగిశాక ఓటు హక్కును పునరుద్ధరిస్తే దాని వల్ల రూపాయి ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. ‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాం’ అనే ఒకే ఒక్క మాటతో కమిషనర్లు లేవనెత్తిన తీవ్రమైన అభ్యంతరాలను మాయం చేయలేరని మంత్రి ఉత్తమ్ అన్నారు. వివాదాస్పద నిర్ణయాలను ఎవరు ఆమోదించారో, అందుకు ఎవరు అనుమతించారో ఎన్నికల సంఘం బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. గోవాలో జరిగిన ఘటనతో పాటు ఓటరు జాబితాల సవరణలో ఉపయోగిస్తున్న సాంకేతిక వ్యవస్థలపై తక్షణమే నిష్పాక్షికమైన విచారణ జరిపించాలని కోరారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్‌ జామ్‌’.. బ్రెడ్‌, శాండ్‌విచ్‌లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com