☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే సాంగ్!

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. పూర్తి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ సరికొత్త అప్‌డేట్ ఇచ్చారు. ‘మాల వచ్చా చూడు..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో చేరింది. ఈ పాటలో వెంకటేశ్‌, నివేదా పేతురాజ్‌ జంట స్క్రీన్‌పై […] The post ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే సాంగ్! appeared first on Adya News Telugu.
‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే సాంగ్!

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. పూర్తి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ సరికొత్త అప్‌డేట్ ఇచ్చారు. ‘మాల వచ్చా చూడు..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో చేరింది.

ఈ పాటలో వెంకటేశ్‌, నివేదా పేతురాజ్‌ జంట స్క్రీన్‌పై సందడి చేసింది. వీరిద్దరి మధ్య సాగే డ్యాన్స్ మూమెంట్స్, రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ‘నీ ఒంట్లో ఉంది కరెంటు.. వెలిగించవే నా ఫిలమెంట్‌’ అంటూ సాగే సాహిత్యం యూత్‌ను ఆకర్షిస్తోంది. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించారు.

సంగీత దర్శకుడు తమన్ ఈ పాటకు అదిరిపోయే బీట్స్ సమకూర్చారు. ధనుంజయ్ సీపాన, రనైనా రెడ్డితో కలిసి తమన్ కూడా ఈ పాటను స్వయంగా ఆలపించారు. గాయనీగాయకుల స్వరాలు పాటకు మరింత ఊపు తెచ్చాయి. స్క్రీన్‌పై వెంకీ మార్క్ ఎనర్జీ మరియు నివేదా గ్లామర్ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ప్రధాన కథానాయికగా నటిస్తోంది. నివేదా పేతురాజ్ మరో కీలక పాత్రను పోషిస్తోంది. నారా రోహిత్, రావు రమేశ్ తదితర ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

The post ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే సాంగ్! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. భారీ ఆశ చూపిన గ్యాంగ్!ఏపీ పోలీసుల తీరుపై మండిపడ్డ సజ్జల! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com