☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Vijayawada: దసరాకు కనకదర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి శుభవార్త.. అన్ని క్యూలైన్లలో దర్శనం ఫ్రీ..

విజయవాడ కనకదుర్గమ్మ భక్తలుకు గుడ్ న్యూస్. దసరా సందర్బంగా అందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నారు. దర్శన టికెట్లను రద్దు చేశారు. వీఐపీ భక్తుల కోసం ప్రత్యేక దర్శన టికెట్లను జారీ చేస్తారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Vijayawada: దసరాకు కనకదర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి శుభవార్త.. అన్ని క్యూలైన్లలో దర్శనం ఫ్రీ..

దసరా సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉచితంగా దుర్గమ్మ దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్ల విధానాన్ని దసరా సందర్భంగా రద్దు చేశారు. టికెట్లతో అవసరం లేకుండా అందరికీ ఉచిత దర్శన భాగ్యం కల్పించనున్నారు. అన్ని క్యూలైన్లలోకి ఉచితంగా ప్రవేశంచి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. దసరా ఉత్సవాల్లో దుర్గగుడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు భక్తులు ఎలాంటి టికెట్ లేకుండా దుర్గమ్మను దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అన్ని క్యూలైన్లను ఉచిత క్యూలైన్లగా కొనసాగించనున్నారు.

సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వీఐపీ, అధికారిక సిఫార్సులపై వచ్చే భక్తుల కోసం భవానీ ప్రత్యేక దర్శనం పేరుతో ప్రత్యేక క్యూలైన్ అందుబాటులో ఉంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికార సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు మాత్రమే ఈ ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శన అవకాశం ఉంటుంది. అయితే వీరికి టికెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఈ టికెట్ తీసుకుని ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఈ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇంద్రకీలాద్రి సమీపంలోని కుమ్మరిపాలెం వద్ద టీటీడీ స్థలంలో ఈ టికెట్లను జారీ చేసేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్లి ఆఫ్‌లైన్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. అలాగే కాళేశ్వరరావు మార్కెట్, స్వరాజ్య మైదానం వద్ద కూడా దర్శన టికెట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రూ.వెయ్యి దర్శనం టికెట్ తీసుకున్న భక్తులను ప్రత్యేక వాహనాల్లో కొండపైకి తీసుకొస్తారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా నేరుగా దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలల్లో ఒక్కొ ట్రిపుకు రెండు గంటల చొప్పున ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. రోజంతా ఈ దర్శనాలకు అవకాశం ఉండదు. ఏ సమయంలో టికెట్లు ఇవ్వాలనేది అధికారులు త్వరలో నిర్ణయించనున్నారు. ఇక సామాన్య భక్తులకు ఐదు క్యూలైన్ల ద్వారా దర్శనం ఉంటుంది. వినాయక ఆలయం, కుమ్మరిపాలెం నుంచి భక్తులు ఐదు క్యూలైన్లలో దర్శనానికి అనుమతించనున్నారు,. ఘాట్ రోడ్డు వద్దకు చేరుకున్నాక మూడు క్యూలైన్లుగా మారతాయి. ఆ తర్వాత టర్నింగ్ పాయింట్ నుంచి ఐదు క్యూలైన్లుగా మారతాయి. శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← శ్రీశైలం మల్లన్న ఆలయ హుండీల లెక్కింపు.. 29 రోజుల్లో భారీగా ఆదాయంAstrology Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు షేర్ చేయొద్దట.. జ్యోతిష్యం వెనుక ఉన్న నమ్మకం ఇదే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com