☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్‌ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత

AP Municipal Elections: విజయవాడలో తెలుగుదేశం పార్టీకి చెందిన టికెట్‌ ఆశావహుల అసంతృప్తి ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న ఇంటి వద్ద 52వ డివిజన్‌ కార్పొరేటర్‌ టికెట్‌ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తనకు టికెట్‌ కేటాయించలేదని టీడీపీ నాయకుడు కొప్పుల గంగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బుద్ధా వెంకన్న అనుచరులు, గంగ అనుచరుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. గత 25 సంవత్సరాలుగా పార్టీ కోసం […]
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్‌ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత

AP Municipal Elections: విజయవాడలో తెలుగుదేశం పార్టీకి చెందిన టికెట్‌ ఆశావహుల అసంతృప్తి ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న ఇంటి వద్ద 52వ డివిజన్‌ కార్పొరేటర్‌ టికెట్‌ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తనకు టికెట్‌ కేటాయించలేదని టీడీపీ నాయకుడు కొప్పుల గంగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బుద్ధా వెంకన్న అనుచరులు, గంగ అనుచరుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. గత 25 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ బీ ఫారం ఇస్తామని చెప్పి మోసం చేశారని కొప్పుల గంగ ఆవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని బుద్ధా వెంకన్నపై గంగ అనుచరులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరోవైపు, ఎంపీ కేశినేని చిన్ని 17 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయారు. ఇదే సమయంలో 52వ డివిజన్‌ టికెట్‌ విషయంలో అసంతృప్తి మరింత పెరిగింది. తనకు బీ ఫారం ఇవ్వలేదనే ఆవేదనతో కొప్పుల గంగ బండరాయితో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో బుద్ధా వెంకన్న ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, పొత్తులో భాగంగా 52వ డివిజన్‌ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించినట్లు బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. కొప్పుల గంగకు టికెట్‌ రాలేదన్నది వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. పొత్తుల కారణంగా ఆ సీటును బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా కొప్పుల గంగకు బుద్ధా వెంకన్న హామీ ఇచ్చారు. 52వ డివిజన్‌ టికెట్‌ దక్కనప్పటికీ, అంతకంటే పెద్ద పదవిని ఇప్పిస్తానని మాట ఇచ్చారు. ఈ హామీతో టికెట్‌ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది?SBI Cyber Attack: ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com