Air Fare Rules: ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థలు ఇష్టానుసారంగా విమాన టికెట్ ధరలను పెంచుతూ ప్రయాణికులను దోచుకుంటున్న వైనానికి త్వరలోనే అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు విమానయాన ఛార్జీల నియంత్రణకు సంబంధించి సరికొత్త నిబంధనలను రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.

రెండు వారాల్లో అధికారిక నోటిఫికేషన్: సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడి
ఎస్. లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కీలక విషయాన్ని కోర్టుకు వెల్లడించారు. పండుగ రద్దీ సమయాల్లో ప్రైవేట్ విమానయాన సంస్థలు విపరీతంగా ధరలు పెంచడంపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం, రెండు వారాల్లోగా ఈ నిబంధనలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
Read also: Abhijeet Deepke: ఢిల్లీలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అరెస్ట్.. అసలేం జరిగింది?
Air Fare Rules: నవంబర్ 16 నాటికి నిబంధనల కాపీ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశం
కేంద్ర ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే నవంబర్ 16 నాటికి కొత్త విమానయాన నిబంధనలకు సంబంధించిన పూర్తి కాపీని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే పండగ వేళల్లో విమాన ప్రయాణికులకు విపరీతమైన ధరల మోత నుంచి భారీ ఊరట లభించే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:


