☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!

vivo S2 FE Launch on October 6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త vivo S2 FE స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. వివో S2కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్ 6, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు vivo S2 FE అధికారికంగా లాంచ్ కానుంది. యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు వివో తెలిపింది. డిజైన్‌తో పాటు ఫంక్షనాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు […]
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!

vivo S2 FE Launch on October 6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త vivo S2 FE స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. వివో S2కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్ 6, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు vivo S2 FE అధికారికంగా లాంచ్ కానుంది.

యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు వివో తెలిపింది. డిజైన్‌తో పాటు ఫంక్షనాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు తమ స్మార్ట్‌ఫోన్లలో అందించిన వాటిలోనే అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో vivo S2 FE రానుందని కంపెనీ వెల్లడించింది.

భారీ బ్యాటరీ & ఇమర్సివ్ డిస్‌ప్లే

భారీ బ్యాటరీతో పాటు ఇమర్సివ్ డిస్‌ప్లేను అందించనున్నారు ఈ మొబైల్ లో. సోషల్ మీడియా వినియోగం, కంటెంట్ క్రియేషన్‌ను దృష్టిలో ఉంచుకుని స్లిమ్ ప్రొఫైల్‌తో ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో రోజువారీ వినియోగంతో పాటు ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ కోసం ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

డ్యూయల్ కెమెరా..

వివో విడుదల చేసిన టీజర్లలో “My New Story” అనే ట్యాగ్‌లైన్‌ను హైలైట్ చేసింది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కూడా ప్రమోషనల్ మెటీరియల్స్ ద్వారా వెల్లడైంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే OriginOS ఆపరేటింగ్ సిస్టమ్‌తో vivo S2 FE అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను Flipkart, vivo India ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మనున్నట్లు కంపెనీ తెలిపింది.

ధర

vivo S2 FEకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లు, కెమెరా వివరాలు, బ్యాటరీ సామర్థ్యం, సేల్ తేదీ వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే లాంచ్ ఈవెంట్‌లో ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలుPOCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్‌ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com