☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఫోక్స్‌వ్యాగన్ నుంచి సరికొత్త ఐడీ. టిగువాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600కిమీ

ఫోక్స్‌వ్యాగన్ నుంచి సరికొత్త ఐడీ. టిగువాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600కిమీ
ఫోక్స్‌వ్యాగన్ నుంచి సరికొత్త ఐడీ. టిగువాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600కిమీ
ఫోక్స్‌వ్యాగన్ నుంచి సరికొత్త ఐడీ. టిగువాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600కిమీ

ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిఫికేషన్ వ్యూహంలో భాగంగా యూరోపియన్ మార్కెట్ల కోసం సరికొత్త 'ఐడీ టిగువాన్' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐడీ.4, ఐడీ.5 మోడళ్లకు సింగిల్ డైరెక్ట్ సక్సెస్సర్‌గా ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రానుంది. యూరప్‌లోని పలు దేశాల్లో దీనికి సంబంధించిన ప్రీ-సేల్స్ అక్టోబర్ 13 నుంచి ప్రారంభం కానుండగా.. దీని ప్రారంభ ధర సుమారు సుమారు రూ.46 లక్షలుగా నిర్ణయించబడింది.

MEB+ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమైన ఈ కొత్త ఐడీ. టిగువాన్ సాంప్రదాయ ఎస్‌యూవీ సిలౌవెట్‌ను సంతరించుకుంది. దీని డిజైన్ బ్రాండ్ ‘ప్యూర్ పాజిటివ్’ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంది. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, షార్ప్ లైన్లు, ఆకర్షణీయమైన బంపర్‌తో పాటు ఇల్యూమినేటెడ్ లోగో దీనికి ప్రత్యేక లుక్‌ను తెచ్చిపెట్టాయి. అలాగే వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ 'ID. TIGUAN' బ్యాడ్జింగ్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో 534 లీటర్ల భారీ బూట్ స్పేస్‌తో పాటు 32 లీటర్ల లగేజ్ స్థలం కారు ముందు భాగంలో అందించారు.

ఇంటీరియర్ ఫీచర్లు:
ఈ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్స్ అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దబడింది. ఇందులో ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్ ఇవ్వగా.. సెంట్రల్‌గా 15 అంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12 అంచుల ప్యాసింజర్ డిస్‌ప్లే మరియు 10 అంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. అంతేకాకుండా పవర్డ్ సీట్లు, 480-వాట్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వీహెచ్‌ఎల్‌ఓడీ(V2L) ఫంక్షనాలిటీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ట్రెండ్, లైఫ్, స్టైల్, ఆర్-లైన్ అనే వేరియంట్లలో కారు లభిస్తుంది.

బ్యాటరీ పనితీరు:
ఫోక్స్‌వ్యాగన్ ఐడీ. టిగువాన్ 58 kWh, 77 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ వెర్షన్ 140 kW మోటార్‌తో రాగా.. పెద్ద బ్యాటరీ ప్యాక్ వెర్షన్లు రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తాయి. వేరియంట్‌ను బట్టి ఈ ఎస్‌యూవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తుంది. దీని టోయింగ్ కెపాసిటీ కూడా 2 టన్నుల వరకు ఉంది. మెుత్తానికి ఈ కారు మన మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పుకోవాలి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఫొటో ఫీచర్ : దసరా సెలవులు.. ఊరిబాట పట్టిన జనంఢిల్లీలో హై టెన్షన్.. కేజ్రీవాల్, మమతా బెనర్జీ అరెస్ట్.. పోలీసులపై రాళ్ల దాడి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com