☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

India vs West Indies : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం.. హోప్ అద్భుత బ్యాటింగ్.. కేఎల్‌ రాహుల్‌ సెంచరీ వృథా

India vs West Indies : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
India vs West Indies : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం.. హోప్ అద్భుత బ్యాటింగ్.. కేఎల్‌ రాహుల్‌ సెంచరీ వృథా

India vs West Indies : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డే శనివారం సాయంత్రం న్యూ చండీగఢ్‌లో జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, గత రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Also Read : IND vs PAK : ఆసియా క్రీడ‌ల్లో టీమ్ఇండియాకు స్వ‌ర్ణం.. ఫైన‌ల్‌లో పాక్ పై భార‌త్ ఘ‌న విజ‌యం..

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (87 బంతుల్లో 129 నాటౌట్‌ 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగి వన్డేల్లో తన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేసుకోగా… ‘హిట్‌ మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 92; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (57; 1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధశతకం సాధించాడు. కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరగ్గా.. కెప్టెన్ గిల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.

భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్ తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 352 పరుగులు చేయగా.. ఐదు వికెట్ల తేడాతో విండీస్ జట్టు విజయం సాధించింది. కెప్టెన్‌ షై హోప్‌ (143 బంతుల్లో 162 నాటౌట్‌; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) అసాధారణంగా ఆడి చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అమిర్‌ జంగూ (67; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కీమో పాల్‌ (44) హోప్‌కు సహకరించారు.

వెస్టిండీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. సిరాజ్, గుర్నార్ బ్రార్, కుల్దీప్, నమన్ ధీర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే అరంగ్రేటం చేసిన అన్షుల్ కంబోజ్ తొమ్మిది ఓవర్లలో 82 పరుగులిచ్చి వికెట్ పడగొట్టలేకపోయాడు. ఇదిలాఉంటే.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అమిర్ జంగూ సొంతం చేసుకోగా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దక్కించుకున్నాడు. భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మంగళవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Shubman Gill : మూడో వన్డేలో ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన కామెంట్స్.. ఆ రెండు అంశాలపై ఆందోళన!Bigg Boss Weekend Episode : గెట్ అవుట్ రోహిత్.. ఆ ముగ్గురికి ఎల్లో కార్డ్స్.. డిజాస్టర్ కెప్టెన్.. నాగార్జున వీకెండ్ ఫైర్.. బిగ్‌ బాస్ 10 డే 27 ఎపిసోడ్‌.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com