☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పెనుబల్లి ప్ర‌జ‌ల‌కు బ్రిడ్జి కష్టాలు తీరెదెన్న‌డు?

చుంచుపల్లి మండలం పెనుబల్లి పంచాయితీ వాసుల వంతెన కష్టాలు తీరడం లేదు. గ్రామానికి కీలకమైన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాదిన్నర గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభ దశను దాటలేదు. సుమారు రూ.6.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ బ్రిడ్జికి...
పెనుబల్లి ప్ర‌జ‌ల‌కు బ్రిడ్జి కష్టాలు తీరెదెన్న‌డు?

– శంకుస్థాపన చేసి ఏడాదిన్నర
– ఇంకా ప్రారంభం కాని నిర్మాణ పనులు
– ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజల్లో భ‌యాందోళ‌న

చుంచుపల్లి, సెప్టెంబర్ 23 : చుంచుపల్లి మండలం పెనుబల్లి పంచాయితీ వాసుల వంతెన కష్టాలు తీరడం లేదు. గ్రామానికి కీలకమైన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాదిన్నర గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభ దశను దాటలేదు. సుమారు రూ.6.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ బ్రిడ్జికి గత ఏడాది మే నెలలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు. పెనుబల్లి నుంచి కొత్తగూడెం పట్టణానికి వెళ్లేందుకు ఈ బ్రిడ్జి ప్రధాన మార్గంగా ఉంది. రైతులు పండించిన పంట వడ్ల బస్తాలు, కూరగాయలు, వ్యవసాయ పనిముట్లతో పాటు విద్యార్థులు, గ్రామస్తులు నిత్యం ఈ మార్గం మీదుగా పట్టణాలకు రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు రెండేళ్ల క్రితం బ్రిడ్జి కుంగిపోవడంతో ప్రస్తుతం దానిపై ప్రయాణించేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించే పరిస్థితులు ఏర్పడి రాకపోకలకు మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

పెనుబల్లి ప్ర‌జ‌ల‌కు బ్రిడ్జి కష్టాలు తీరెదెన్న‌డు?

పెనుబల్లి ప్ర‌జ‌ల‌కు బ్రిడ్జి కష్టాలు తీరెదెన్న‌డు?

ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళన : రెడ్డి సుజాత, పెనుబల్లి సర్పంచ్

శంకుస్థాపన చేసి ఏడాదిన్నర గడుస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అధికారులు పలుమార్లు వచ్చి పరిశీలిస్తున్నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పెనుబల్లి ప్రజలు పట్టణానికి వెళ్లేందుకు ఈ బ్రిడ్జిపైనే ఆధారపడుతున్నారని, వర్షాకాలంలో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలి.

పెనుబల్లి ప్ర‌జ‌ల‌కు బ్రిడ్జి కష్టాలు తీరెదెన్న‌డు?

పెనుబల్లి ప్ర‌జ‌ల‌కు బ్రిడ్జి కష్టాలు తీరెదెన్న‌డు?

త్వరలో పనులు ప్రారంభిస్తాం : పీఆర్ డీఈ జె.నాగేంద్ర

బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఏడాది క్రితమే పూర్తయింది. బ్రిడ్జి కింద రాక్, సాండ్‌కు సంబంధించిన పరిశీలనలు పూర్తయ్యాయి. ఉన్నతాధికారులు ఎస్ఈ కూడా ఇటీవల ప్రాంతాన్ని సందర్శించారు. బ్రిడ్జిపై ఉన్న విద్యుత్ వైర్లను తొలగించేందుకు సోలార్ పవర్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడాము. బ్రిడ్జి డిజైన్‌ను ఆమోదం కోసం పంపించాము. నిర్మాణానికి అవసరమైన స్టీల్ కూడా సిద్ధంగా ఉంది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Swami Ramdev | ప‌తంజ‌లి నెయ్యిలో క‌ల్తీ లేదు.. మందుల‌పై నిషేధం అబద్ధం.. స్వామి రామ్‌దేవ్Sobhita Dhulipala : స్టైలిష్ లుక్‌లో అందాలు ఆర‌బోస్తున్న శోభిత‌.. ఫోటోలు వైర‌ల్‌.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com