☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రో‌చ్‌లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న సీజేపీ నేతలు అభిజత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానంలోనే అరెస్ట్ చేసి, వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. తమను అరెస్ట్ చేస్తారని భావించిన దీప్కే, ఉద్యమ బాధ్యతల్ని అజింక్య షిండేకు అప్పగించారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని సూచించారు. […]
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రో‌చ్‌లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న సీజేపీ నేతలు అభిజత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానంలోనే అరెస్ట్ చేసి, వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. తమను అరెస్ట్ చేస్తారని భావించిన దీప్కే, ఉద్యమ బాధ్యతల్ని అజింక్య షిండేకు అప్పగించారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని సూచించారు.

ఇప్పుడు అజింక్యా షిండే ఎవరని చాలా మందిలో ఆసక్తి నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అయిన అజింక్య షిండే.. జంతర్ మంతర్ నీట్ పేపర్ లీక్ ఉద్యమానికి తెరవెనక వ్యూహకర్తగా ఉన్నాడు. ఇప్పుడు, నిరసనల్లో అగ్ర నాయకత్వం అరెస్ట్ కావడంతో, నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు వెళ్లాలని షిండే పిలుపునిచ్చారు.

అజింక్య షిండే ఎవరు..?

మహారాష్ట్రకు చెందిన 35 ఏళ్ల అజింక్య షిండే, పూణేలోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరారు. ఆయన తల్లిదండ్రులు గతంలో అలీబాగ్ ప్రాంతంలో ఉండేవారని, ఆ తర్వాత లాతూర్‌కు వెళ్లారు.

షిండేకు అభిజిత్ దీప్కేతో చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ ఆప్‌లో పనిచేసే సమయంలో మిత్రులుగా మారారు. 2016లో గోవాలో వీరిద్దరూ తొలిసారి కలేసుకున్నారు. అప్పటి నుంచి కలిసి పనిచేస్తున్నారు. షిండే పింప్రి-చించ్వాడ్‌లో AAP కన్వీనర్‌గా పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం ఏడాది పాటు పనిచేశారు. ఆ తర్వాత AAP మహారాష్ట్ర విభాగంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా, ఆ పార్టీ యువజన విభాగం కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

2026లో సీజేపీ కార్యవర్గంలోకి..

ఆప్‌లో కీలక నేతగా ఉన్న షిండే, 2026 ఆగస్టులో సీజేపీ జాతీయ టీమ్‌లో చేరారు. జాతీయ సంస్థాగత వ్యవహారాల బాధ్యతల్ని అప్పగించారు. ఈ నియామకంపై గతంలో విమర్శలు కూడా వచ్చాయి. దీప్కే తన సన్నిహితులకు స్థానం కల్పించి, అసలైన నిరసనకారుల్ని మరిచిపోయారని పలువురు విమర్శించారు. ప్రస్తుతం దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా పోలీసుల అదుపులో ఉండటంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను షిండే చేతుల్లో పెట్టారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్‌జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com