☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు

Makkah Defence Pact: పాకిస్తాన్-సౌదీ అరేబియా-టర్కీలు కలిసి ‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’పై సంతకం చేశాయి. ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఒక దేశంపై దాడి జరిగితే అది మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తూ, రక్షణగా నిలుస్తామని మక్కా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ మక్కా కూటమికి సెక్రటరీ జనరల్‌గా పాకిస్తాన్ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) నౌమాన్ మహమూద్‌ నియమితులయ్యారు. భారత్‌తో యుద్ధంలో తండ్రి మరణం: నౌమాన్ మహమూద్ తండ్రి రజా సుల్తాన్ మహమూద్ […]
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు

Makkah Defence Pact: పాకిస్తాన్-సౌదీ అరేబియా-టర్కీలు కలిసి ‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’పై సంతకం చేశాయి. ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఒక దేశంపై దాడి జరిగితే అది మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తూ, రక్షణగా నిలుస్తామని మక్కా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ మక్కా కూటమికి సెక్రటరీ జనరల్‌గా పాకిస్తాన్ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) నౌమాన్ మహమూద్‌ నియమితులయ్యారు.

భారత్‌తో యుద్ధంలో తండ్రి మరణం:

నౌమాన్ మహమూద్ తండ్రి రజా సుల్తాన్ మహమూద్ 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ 32 బలూచ్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. పాకిస్తాన్ సైనిక చరిత్ర ప్రకారం.. తూర్పు పాకిస్తాన్‌లోని పిర్‌గంజ్ ప్రాంతంలో జరిగిన పోరులో ఆయన మరణించారు. భారత్ సైన్యం వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న స్థావరాన్ని భారత గూర్ఖా రైఫిల్స్ చేజిక్కించుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో రజా సుల్తాన్ మహమూద్ హతమయ్యారు.

పాక్ సైన్యంలో అనేక పదవుల్లో పనిచేసిన నౌమాన్..

నౌమాన్ మహమూద్ 1987లో పాకిస్తాన్ సైన్యంలో చేరారు. పదాతిదళంలో పనిచేసి, కమాండర్ బాధ్యతలు నిర్వహించారు. పాకిస్తాన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023లో సైన్యం నుంచి పదవీవిరమణ పొందారు. హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై భీకరదాడులు చేస్తున్న సమయంలో నౌమాన్ నియామకం జరిగింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Faria Abdullah: బోనాలు సమర్పించడంపై ట్రోలింగ్.. మరోసారి స్పందించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లాOTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com