☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఏందో తెలుసుకోండి..

మీరు ఉడకబెట్టిన గుడ్డు పచ్చసొన ఎప్పుడైనా ఆకుపచ్చగా లేదా ముదురు రంగులోకి మారిందా? అది చూసి గుడ్డు పాడైపోయిందని చెత్తబుట్టలో పడేస్తున్నారా? ఆగండి.. అసలు సొన రంగు ఎందుకు మారుతుంది? అది విషపూరితమా లేక తినొచ్చా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలిస్తే మీరు అస్సలు పారేయరు.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఏందో తెలుసుకోండి..

చాలామంది ఉదయం ఉడికించిన గుడ్లను తప్పనిసరిగా తింటుంటారు. శరీరానికి అవసరమైన అత్యుత్తమ ప్రొటీన్లు, విటమిన్లు అందించడంలో ఉడకబెట్టిన గుడ్లకు తిరుగులేదు. అయితే కొన్నిసార్లు గుడ్డును ఉడికించి పెంకు తీసి చూసినప్పుడు.. లోపల పచ్చసొన చుట్టూ ముదురు బూడిద లేదా ఆకుపచ్చ రంగు పొర కనిపిస్తుంది. ఇది చూడగానే చాలామంది కంగారుపడుతుంటారు. గుడ్డు కుళ్లిపోయిందా? లేదా తింటే కడుపు పాడవుతుందా? అని సందేహిస్తూ పారేస్తుంటారు. అయితే ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీని వెనుక ఒక సాధారణ రసాయన చర్య దాగి ఉందని సైన్స్ చెబుతోంది.

రంగు ఎందుకు మారుతుంది?

గుడ్డు సొన ముదురు రంగులోకి మారడానికి ప్రధాన కారణం వాటిని అధిక ఉష్ణోగ్రత వద్ద లేదా ఎక్కువ సమయం పాటు ఉడకబెట్టడమే. గుడ్డులోని తెల్లసొనలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది, పచ్చసొనలో ఐరన్ అధికంగా ఉంటుంది. గుడ్డును ఎక్కువ సేపు ఉడికించినప్పుడు తెల్లసొనలోని సల్ఫర్ వాయువు రూపంలో పచ్చసొన వైపు చేరుతుంది. అక్కడ సొనలోని ఇనుముతో ఆ సల్ఫర్ చర్య జరిపి ఐరన్ సల్ఫైడ్‌గా మారుతుంది. ఈ ఐరన్ సల్ఫైడ్ కారణంగానే పచ్చసొన బయటి అంచు ఆకుపచ్చ లేదా బూడిద రంగులోకి మారిపోతుంది.

ఈ గుడ్లు తినడం సురక్షితమేనా?

పోషకాహార నిపుణుల ప్రకారం.. పచ్చసొన ఆకుపచ్చగా లేదా ముదురు రంగులోకి మారినప్పటికీ, ఆ గుడ్డు తినడానికి 100 శాతం సురక్షితమైనదే. అది కుళ్లినది కాదు, విషపూరితమైన పదార్థం అంతకంటే కాదు. ఈ రసాయన చర్య వల్ల గుడ్డులోని పోషక విలువలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. అయితే చూడటానికి కాస్త అసహ్యంగా కనిపించడం, స్వల్పంగా వాసనలో తేడా ఉండటం మినహా శరీరానికి ఎలాంటి హాని జరగదు.

పచ్చసొన సహజ రంగులో ఉండాలంటే ఏం చేయాలి?

గుడ్లను ఉడకబెట్టే సమయంలో కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే పచ్చసొన తన సహజసిద్ధమైన పసుపు లేదా నారింజ రంగును కోల్పోకుండా ఉంటుంది.

ఎక్కువ సేపు ఉడికించవద్దు: నీరు మరగడం ప్రారంభించిన తర్వాత మధ్యస్థ మంట మీద 8 నుండి 10 నిమిషాలకు మించి ఉడికించకూడదు.

వెంటనే చల్లటి నీళ్లలోకి మార్చాలి: నిర్ణీత సమయం పూర్తయిన వెంటనే గుడ్లను వేడి నీటిలో నుంచి తీసి, ఐస్ వాటర్ లేదా చల్లటి నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉష్ణోగ్రత తక్షణమే తగ్గి, రసాయన చర్య ఆగిపోతుంది.

ఉడికించిన గుడ్డు పచ్చసొన రంగు మారినా భయపడాల్సిన పనిలేదు. కానీ సరైన సమయానికి ఉడికించి, వెంటనే చల్లటి నీటిలో వేస్తే గుడ్డు రుచిగా ఉండటమే కాకుండా చూడటానికి కూడా సహజ రంగుతో ఆకట్టుకుంటుంది.

⬇ Full News JPG⬇ Short News JPG
← Asian Games 2026: కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్.. ఆసియా క్రీడల్లో భారత్‌కు 12వ పతకంఈ నెల 25న గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. పోలీసుల హెచ్చరిక ఇదే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com