☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

World Mental Health Day: మూడ్ బాగోలేనప్పుడు చాయ్ తాగాలని ఎందుకు అనిపిస్తుంది?

ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్నిజరుపుకుంటారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశం.. ప్రజల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం, దీనికి సంబంధించిన సమస్యల గురించి సరైన సమాచారం ఇవ్వడం. మనం నిత్యం తీసుకునే ఆహారం, పానీయాలు కూడా మన మెదడుపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.
World Mental Health Day: మూడ్ బాగోలేనప్పుడు చాయ్ తాగాలని ఎందుకు అనిపిస్తుంది?
Chai

మనం దేశంలో ఉదయం ఒక కప్పు టీ తాగకుండా ఆ రోజు మొదలవ్వదు. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచవ్యాప్తంగా కూడా జనాభా చాయ్ తాగుతారు. ఏ మాత్రం చిన్న అలసటగా అనిపించినా, మత్తుగా ఉన్నా, ఒక కప్పు టీ పడితే చాలు అది మీ మెదడు పై ప్రభావం చూపుతుంది. అయితే ఈ చాయ్, చాక్లెట్ లాగే మనకు రిలాక్స్‌గా చేస్తుందా? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..

World Mental Health Day

ఇప్పటికీ చాలా మంది మానసిక ఆరోగ్యానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనివల్ల కొందరిలో ఒత్తిడి పెరిగి అది డిప్రెషన్‌గా మారుతుంది. ఇలాగే వదిలేస్తే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. అంటే దాదాపు 1.2 బిలియన్ల మంది. వీరిలో ఆందోళన, డిప్రెషన్ సాధారణ సమస్యలు.

World Mental Health Day 2

మీరు టీ లవర్స్ అయితే, ఒక అధ్యయనం ప్రకారం, చాయ్ మానసిక ఆరోగ్యానికి మంచిదని తెలిసి సంతోషిస్తారు. ఈ అధ్యయనాన్ని 491 మంది పెద్దలపై (169 మంది పురుషులు, 322 మంది మహిళలు) నిర్వహించారు. రోజుకు నాలుగు కప్పుల వరకు బ్లాక్ టీ తీసుకోవడం వల్ల 450 600 మిల్లీగ్రాముల కెఫిన్ ఉందని , ఇంకా ఇది డిప్రెషన్‌ను నివారించడంలో హెల్ప్ చేస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

Green Tae

ఈ అధ్యయనం ప్రకారం బ్లాక్ టీ మీ మానసిక ఆరోగ్యానికి మంచిదని చెబుతుంది. ఈ చాయ్‌లో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మన దేశంలో ఎంతో మంది చక్కెర, పాలతో చాయ్ తాగుతారు. దీనిని మరి ఎక్కువగా తాగడం వలన జీర్ణక్రియకు హాని కలగవచ్చు.. ఇంకా కేలరీల తీసుకోవడం కూడా ఇది పెరగవచ్చు.

World Mental Health Day 4

బ్లాక్ టీతో పాటు గ్రీన్ టీ కూడా మీ మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీ తాగితే డిప్రెషన్ కొంత మేరకు తగ్గుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఇది ఆందోళన, డిప్రెషన్, సైకోటిక్ లక్షణాలను తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుందని అంటున్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మీరు బ్లాక్ టీతో పాటు గ్రీన్ టీని తీసుకుంటే మంచిది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే చాలు ఏదైనా చేయగలను.. డైరెక్టర్ రాజమౌళి..పిల్లలు ఇష్టంగా తినే కమ్మనైన కొబ్బరిపాల చికెన్ కర్రీ.. పాతకాలం నాటి స్టైల్‌లో ముక్క మెత్తగా.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com