☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్‌లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..

XI Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఎయిర్‌పోర్టు‌కు వెళ్లి జిన్‌పింగ్‌ను స్వాగతించారు. ఇద్దరు నేతలు వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)గురించి చర్చంచారు. AI అభివృద్ధి ఎప్పటికీ మానవ నియంత్రణలోనే ఉండేలా అమెరికా, చైనా కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు. ‘‘AI మంచి కోసం అభివృద్ధి చేసి, నిర్వహించే సామర్థ్యం, బాధ్యత మనకు ఉంది. AI ఎల్లప్పుడూ మనిషి […]
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్‌లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..

XI Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఎయిర్‌పోర్టు‌కు వెళ్లి జిన్‌పింగ్‌ను స్వాగతించారు. ఇద్దరు నేతలు వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)గురించి చర్చంచారు. AI అభివృద్ధి ఎప్పటికీ మానవ నియంత్రణలోనే ఉండేలా అమెరికా, చైనా కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు.

‘‘AI మంచి కోసం అభివృద్ధి చేసి, నిర్వహించే సామర్థ్యం, బాధ్యత మనకు ఉంది. AI ఎల్లప్పుడూ మనిషి కంట్రోల్‌లోనే ఉండేలా చూడాలి’’ అని జిన్‌పింగ్ అన్నారు. ట్రంప్, జిన్‌పింగ్ భేటీలో ఏఐ అంశం కీలకంగా మారింది. రెండు దేశాలు ఏఐ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న తరుణంలో చైనా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల తలెత్తే భద్రతా ప్రమాదాలపై పరస్పర చర్చ అవసరమని ఇద్దరు నేతలు భావించారు. జిన్‌పింగ్‌తో భేటీకి ముందు ట్రంప్ తన ట్రూత్‌సోషల్ వేదికగా ‘‘సూపర్ ఇంటెలిజెన్స్ (SI)’’ చర్చల్లో ప్రధానంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ గవర్నెన్స్ విషయంతో ప్రస్తుత విధానాన్ని మార్చకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చైనా, అమెరికా దేశాల పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ, విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి అంశాలను వెతుక్కోగలవని, రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోగలవని జిన్‌పింగ్ అన్నారు. చైనా-అమెరికా సహకారం ప్రపంచంలోని ప్రతీ సమస్యను పరిష్కరించకపోవచ్చు, కానీ మా సహకారం లేకుండా ప్రపంచంలోని అనేక సమస్యల్ని పరిష్కరించడం కష్టమని అన్నారు. అమెరికన్ పెట్టుబడిదారులకు చైనా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు.

ఇదిలా ఉంటే, ఈ వారంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, చైనా వసైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్ మధ్య జరిగిన చర్చల్లో ఏఐ సంబంధిత ప్రమాదాలపై నోటిఫికేషన్ మెకానిజం ఏర్పాటు చేసే ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఏఐ ఘటనపై ఇరు దేశాలు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలనే విధానం ఇందులో ఉంది. అయితే దీనిపై రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు జరగలేదు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com