☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

యానాం మార్కెట్‌లో చీరమేను సందడి.. బకెట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

యానాం మార్కెట్‌లో అరుదైన చీరమేను చేపల సందడి మొదలైంది. శీతాకాలం ప్రారంభంతో, ఈ చేపలు మార్కెట్‌కు చేరాయి. మొదటి బకెట్ ఏకంగా రూ. 26,000కు వేలం పోగా, సేరు రూ. 4,000కు అమ్ముడవుతోంది. తూర్పు గాలులు వీచే సమయంలో లభించే ఈ చేపలతో స్థానికులు రుచికరమైన వంటకాలు చేసుకుంటారు. దీపావళి వరకు లభ్యత ఎక్కువగా ఉంటుందని అంచనా.
యానాం మార్కెట్‌లో చీరమేను సందడి.. బకెట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

యానాం: శీతాకాలం ప్రారంభం కావడంతో యానాం మార్కెట్‌లో అరుదైన చీరమేను సందడి మొదలైంది. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఈ చేపలు ఈ ఏడాది తొలిసారిగా మార్కెట్‌కు చేరడంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. తొలి బకెట్‌ చీరమేను వేలంలో ఏకంగా రూ.26 వేలకు అమ్ముడైంది.

స్థానిక మత్స్యకార మహిళ నాటి పార్వతి ఈ బకెట్‌ను వేలంలో దక్కించుకున్నారు. అనంతరం చీరమేనును సేరు రూ.4 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. దీంతో మార్కెట్‌లో చీరమేను కొనుగోలు చేసేందుకు మాంసాహార ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.

చీరమేను ప్రధానంగా తూర్పు గాలులు వీచే సమయంలో మత్స్యకారులకు లభిస్తుందని స్థానికులు చెబుతున్నారు. నీటి అడుగు భాగంలో ఉండే ఈ చిన్న చేపలు తూర్పు గాలుల ప్రభావంతో నీటి ఉపరితలానికి చేరుకుంటాయని మత్స్యకారులు వివరించారు. ఇవి చాలా చిన్నగా ఉండటంతో గతంలో చీరల సాయంతో పట్టుకునేవారని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేకంగా తయారు చేసిన సన్నని వలలను ఉపయోగించి వీటిని పట్టుకుంటున్నారు.

ఇటీవల తుపాన్ ప్రభావంతో తూర్పు గాలులు వీస్తుండటంతో చీరమేను పట్టుకునేందుకు పలువురు మత్స్యకారులు వేటకు వెళ్తున్నారు. సీజన్‌ ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో మార్కెట్‌కు మరింతగా చీరమేను వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

చీరమేనుతో స్థానికులు పలు రకాల వంటకాలు తయారు చేసుకుంటారు. ముఖ్యంగా చింతకాయ, నిమ్మకాయతో ఇగురు, గారెలు వంటి వంటకాలను చేసుకుని ఆరగిస్తారు. ఇప్పటి నుంచి దీపావళి వరకు చీరమేను లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ప్రత్యేక వలలతో వేట కొనసాగించనున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Indian Railways: ట్రైన్ నడుపుతున్నప్పుడు లోకో పైలట్‌కు వాష్‌రూమ్ వస్తే ఏం చేస్తారు? చాలామందికి తెలియని నిజం ఇదే!Shubman Gill: టీమిండియాకు బిగ్ షాక్.. ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ శుభమన్ గిల్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com