☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు!

Yash React on Ramayana Budget: భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితేశ్‌ తివారీ రూపొందిస్తున్న ఈ ఇతిహాస సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా ప్రమోషన్లలో పదేపదే బడ్జెట్‌ గురించి ప్రస్తావించడంపై వస్తున్న విమర్శలపై యశ్‌ తాజాగా స్పందించారు. అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ సినిమా […]
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు!

Yash React on Ramayana Budget: భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితేశ్‌ తివారీ రూపొందిస్తున్న ఈ ఇతిహాస సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా ప్రమోషన్లలో పదేపదే బడ్జెట్‌ గురించి ప్రస్తావించడంపై వస్తున్న విమర్శలపై యశ్‌ తాజాగా స్పందించారు. అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ సినిమా స్థాయిని పరిచయం చేయడానికే బడ్జెట్‌ వివరాలను వెల్లడిస్తున్నామని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 15న బెంగళూరులో జరిగిన రామాయణ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో యశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

విదేశాల్లో సినిమాను ప్రమోట్‌ చేసేటప్పుడు దాని నిర్మాణ స్థాయి, పెట్టుబడి గురించి ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఉందని యశ్‌ అభిప్రాయపడ్డారు. తక్కువ బడ్జెట్‌ సినిమాగా పరిచయం చేస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని పేర్కొన్నారు. ‘నమిత్‌ మల్హోత్రా రామాయణ కోసం రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పినప్పటి నుంచి చాలామంది ఆయనను విమర్శిస్తున్నారు. మన దేశంలో ఇదే సమస్య. విదేశాలకు వెళ్లి మన సినిమాలను ప్రమోట్‌ చేసేటప్పుడు తక్కువ బడ్జెట్‌ సినిమా అని చెబితే.. అక్కడి ప్రేక్షకులు దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. సినిమా నిర్మాణానికి ఎంత పెట్టుబడి పెట్టామో ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. మన దేశాన్ని, మనం ఏమి చేయగలమో ప్రపంచానికి చూపించాలి’ అని యశ్‌ చెప్పుకొచ్చారు.

రామాయణను కేవలం భారీ బడ్జెట్‌ చిత్రంగా మాత్రమే కాకుండా.. భారతీయ సినిమా సాంకేతిక సామర్థ్యాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశంగా చూడాలని యశ్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి భారీ ప్రాజెక్టును నిర్మించడానికి అవసరమైన పెట్టుబడి, సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ప్రయత్నాలను ప్రపంచ ప్రేక్షకులకు తెలియజేయడం ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే మన దేశంలో రూపొందే సినిమాలను మనమే తక్కువ చేసి మాట్లాడకూడదన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ సాధిస్తున్న పురోగతిని గుర్తించి, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశీయ సినిమాలను విమర్శించే ముందు వాటి వెనుక ఉన్న ప్రయత్నాన్ని, లక్ష్యాన్ని కూడా అర్థం చేసుకోవాలని యశ్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రవి దూబే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రం పార్ట్ 1 ఈ దీపావళికి రిలీజ్ కానుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..!Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com