☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Maharashtra | మ‌హారాష్ట్ర‌లో 19 ఏళ్ల యువ‌తిపై గ్యాంగ్‌రేప్.. ఆటో డ్రైవ‌ర్లు స‌హా ఐదుగురు అరెస్ట్

Maharashtra : మ‌హారాష్ట్ర‌లో దారుణం జ‌రిగింది. 19 ఏళ్ల యువ‌తిపై కొంద‌రు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న సెప్టెంబ‌ర్ 24, వేకువ ఝామున, మ‌హారాష్ట్ర‌, వార్ధా రైల్వే స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది.
Maharashtra | మ‌హారాష్ట్ర‌లో 19 ఏళ్ల యువ‌తిపై గ్యాంగ్‌రేప్.. ఆటో డ్రైవ‌ర్లు స‌హా ఐదుగురు అరెస్ట్

Maharashtra : మ‌హారాష్ట్ర‌లో దారుణం జ‌రిగింది. 19 ఏళ్ల యువ‌తిపై కొంద‌రు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న సెప్టెంబ‌ర్ 24, వేకువ ఝామున, మ‌హారాష్ట్ర‌, వార్ధా రైల్వే స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలివి. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఒక 19 ఏళ్ల‌ యువ‌తి త‌న చంద్రాపూర్‌లో ఉన్న త‌న బంధువుల్ని క‌లిసి, సేవాగ్రామ్ వెళ్లింది.

అక్క‌డ్నుంచి బుధ‌వారం అర్ధ‌రాత్రి వార్దా రైల్వే స్టేష‌న్ చేరుకుంది. రైల్వేస్టేష‌న్‌లో ఒంట‌రిగా ఉన్న యువ‌తిని బ‌స్సు డిపోకు తీసుకెళ్తాన‌ని న‌మ్మించి ఒక ఆటో డ్రైవ‌ర్ త‌న ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. అయితే, బ‌స్ డిపోకు తీసుకెళ్ల‌కుండా నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లాడు. అక్క‌డ ఇద్ద‌రు ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆమె అక్క‌డినుంచి త‌ప్పించుకుని వ‌చ్చింది. రైల్వే స్టేష‌న్‌లో ఉన్న ఆమె వ‌ద్ద‌కు మ‌రికొంద‌రు వ‌చ్చారు. వాళ్లు కూడా ఆమెను అక్క‌డినుంచి తీసుకెళ్లారు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. వీరిలో మొద‌ట అత్యాచారానికి పాల్ప‌డ్డ నిందితులు కూడా ఉన్నారు.

ఈ ఘ‌ట‌న బుధ‌వారం అర్ధ‌రాత్రి 2.00 గంట‌ల త‌ర్వాత జ‌రిగింది. త‌ర్వాతి రోజు ఉద‌యం బాధితురాలు స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రిపారు. అత్యాచారానికి పాల్ప‌డ్డ ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో ఆటో డ్రైవ‌ర్లు కూడా ఉన్నారు. ఇంకా ఎవ‌రైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో కూడా ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని రైల్వే ఎస్పీ మంగేష్ షిండే తెలిపారు. పూర్తి స్థాయి ద‌ర్యాప్తు అనంత‌రం త‌గిన వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Asian Games | టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం.. సాత్విక్- చిరాగ్ తొలి రౌండ్‌ దాటలే..!‘జీవో 134ను వెంటనే రద్దు చేయాలి’ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com