☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games | టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం.. సాత్విక్- చిరాగ్ తొలి రౌండ్‌ దాటలే..!

Asian Games : ఆసియా క్రీడల్లో ఆరో రోజు భారత బృందానికి వరసగా షాక్‌లు తగిలాయి. అంతర్జాతీయ వేదికల్లో దుమ్మరేపుతున్న భారత డబుల్స్ ద్వయం తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.
Asian Games | టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం.. సాత్విక్- చిరాగ్ తొలి రౌండ్‌ దాటలే..!

Asian Games : ఆసియా క్రీడల్లో ఆరో రోజు భారత బృందానికి వరసగా షాక్‌లు తగిలాయి. అంతర్జాతీయ వేదికల్లో దుమ్మరేపుతున్న భారత డబుల్స్ ద్వయం తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఫేవరెట్ అయిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిల జోడీని థాయ్‌లాండ్ జంట చిత్తు చేసింది. ఇక కామన్వెల్త్ క్రీడల్లో పతకంతో మెరిసిన బాక్సర్ ప్రీతి పవార్ (Preeti Pawar) సైతం 16వ రౌండ్‌లోనే నిష్క్రమించింది. అయితే.. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ద్వయం అదరగొట్టింది. మనుష్‌ షా, దియా చిటాలేలు చైనా జంటను చిత్తు చేసి కాంస్యంతో మురిసింది.

జపాన్ వేదికగా జరుగుతున్న పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత స్టార్ డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన ఈ జంట పురుషుల విభాగంలో పతకం గెలుస్తారనుకుంటే తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పీరట్చాయ్ సుఖ్‌ఫున్ – పక్కాపొన్ తీరరాత్సకుల్‌(థాయ్‌లాండ్) ద్వయం దూకుడు ముందు భారత జోడీ నిలవలేకపోయింది. మొదటి సెట్‌ను 21-12తో గెలుపొందిన సాత్విక్ – చిరాగ్ జంట ఆపై తడబడింది. గొప్పగా పుంజుకున్న థాయ్ షట్లర్లు.. వరసగా 21-19, 21-14తో రెండు సెట్లలో సత్తా చాటారు. దాంతో.. సాత్విక్ – చిరాగ్ జోడీ నిరాశతో టోర్నీని వీడింది.

కాంస్య గర్జన

టేబుల్ టెన్నిస్‌లో వ్యక్తిగతంగా విఫలమైన భారత బృందం.. మిక్స్‌డ్ డబుల్స్‌ విభాగంలో చెలరేగింది. మనుషా షా, దియా చిటాలే బృందం సెమీస్‌లో ఓడినా కాంస్యం పట్టేసింది. శుక్రవారం చైనా జంట వాంగ్ చుకిన్ – సున్ ఇంక్షా ధాటికి మనుషా, దియా సమాధానం ఇవ్వలేకపోయారు. మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన చైనా జోడీ.. 11-5, 11-8, 11-8తో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది.

ప్రీతి పంచ్‌ అదరలే

ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం కొల్లగొట్టిన ప్రీతి పవార్ ఆసియా క్రీడల్లో మాత్రం అంచనాలు అందుకోలేదు. మహిళల 54 కిలోల విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ప్రీతి తొలి రౌండ్‌లోనే అనూహ్యంగా కంగుతిన్నది. ఉత్తర కొరియా బాక్సర్ చొల్ మి పాంగ్ ధాటికి వరసగా రెండు రౌండ్లలో తేలిపోయిన భారత స్టార్‌ ఓటమితో నిరాశపరిచింది. గత ఆసియాడ్‌లో కాంస్యంతో మెరిసిన తను.. ఈసారి ఉత్త చేతులతోనే స్వదేశం రానుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Khairatabad Bada Ganesh | ఖైరతాబాద్‌ బడా గణేశుడికి ఘనమైన వీడ్కోలుMaharashtra | మ‌హారాష్ట్ర‌లో 19 ఏళ్ల యువ‌తిపై గ్యాంగ్‌రేప్.. ఆటో డ్రైవ‌ర్లు స‌హా ఐదుగురు అరెస్ట్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com