☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Khairatabad Bada Ganesh | ఖైరతాబాద్‌ బడా గణేశుడికి ఘనమైన వీడ్కోలు

Khairatabad Bada Ganesh | భాగ్యనగరం ఆధ్యాత్మిక సంద్రమైంది.. భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. శుక్రవారం ఎటు చూసినా గణనాథుల కోలాహలం.. జయజయ ధ్వానాలతో నగరం పులకించిపోయింది.
Khairatabad Bada Ganesh | ఖైరతాబాద్‌ బడా గణేశుడికి ఘనమైన వీడ్కోలు

Khairatabad Bada Ganesh | భాగ్యనగరం ఆధ్యాత్మిక సంద్రమైంది.. భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. శుక్రవారం ఎటు చూసినా గణనాథుల కోలాహలం.. జయజయ ధ్వానాలతో నగరం పులకించిపోయింది. ఖైరతాబాద్‌ బడా గణేశుడి విమహానిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తుతో కొలువుదీరిన ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ హుస్సేన్‌సాగర్‌ గంగమ్మ ఒడికి చేరారు. భక్తుల జయజయధ్వానా మధ్య హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న క్రేన్ నంబర్ 4 వద్ద బడా గణేశుడి నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది.

ఉదయం 9 : 30 గంటలకు ఖైరతాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభమైంది. సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా‌, టెలిఫోన్‌ తెలంగాణ తల్లి చౌరస్తా, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ఈ శోభాయాత్ర కొనసాగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు హుస్సేన్‌ సాగర్‌లో భారీ క్రేన్స్‌ సాయంతో నిమజ్జనం చేశారు.

ఖైరతాబాద్ గణనాథుడి చివరి రూపాన్ని చూసేందుకు, నిమజ్జన వేడుకను వీక్షించేందుకు రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాలకు తరలివచ్చారు. నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు వీలుగా హైదరాబాద్‌ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడమే కాకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా పెట్టారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← CEO Sudarshan Reddy | ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి : సీఈవో సుదర్శన్ రెడ్డిAsian Games | టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం.. సాత్విక్- చిరాగ్ తొలి రౌండ్‌ దాటలే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com