☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

CEO Sudarshan Reddy | ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి : సీఈవో సుదర్శన్ రెడ్డి

CEO Sudarshan Reddy | ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి (సూచించారు.
CEO Sudarshan Reddy | ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి : సీఈవో సుదర్శన్ రెడ్డి

వికారాబాద్ : ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు ( Vote register ) చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి (CEO Sudarshan Reddy) సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల ను శుక్రవారం పరిశీలించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారుల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

తాండూర్ పట్టణంలోని పాత మున్సిపాలిటీ, ఎంపీటీ హాల్, గౌతాపూర్ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆన సందర్శించి బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఓటరు నమోదు, నోటీసుల పంపిణీ, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ తదితర ప్రక్రియలను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం ఓటర్లకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మాత్రం 72 శాతం నోటీసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు అందులో పేర్కొన్న వివరాల ప్రకారం అవసరమైన సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉందని వివరించారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని బీఎల్‌వోల సహకారంతో కూడా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.

తాండూర్ ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ , ఆర్డీవో అనిత, తహసీల్దార్ తారా సింగ్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Anumana Pakshi | ‘అనుమాన పక్షి’ రివ్యూ.. విమల్ కృష్ణ టేకింగ్, రాగ్ మ‌యూర్‌ నటన ఎలా ఉంది!Khairatabad Bada Ganesh | ఖైరతాబాద్‌ బడా గణేశుడికి ఘనమైన వీడ్కోలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com