☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Anumana Pakshi | ‘అనుమాన పక్షి’ రివ్యూ.. విమల్ కృష్ణ టేకింగ్, రాగ్ మ‌యూర్‌ నటన ఎలా ఉంది!

Anumana Pakshi | 'డిజె టిల్లు' వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన తాజా చిత్రం 'అనుమాన పక్షి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథాకథనాలు ఎలా ఉన్నాయో సమీక్షలో చూద్దాం.
Anumana Pakshi | ‘అనుమాన పక్షి’ రివ్యూ.. విమల్ కృష్ణ టేకింగ్, రాగ్ మ‌యూర్‌ నటన ఎలా ఉంది!

‘డిజె టిల్లు’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అనుమాన పక్షి’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథాకథనాలు ఎలా ఉన్నాయో సమీక్షలో చూద్దాం.

కథ
సన్నీ (రాగ్ మ‌యూర్‌) ‘అనుమాన పక్షి’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటాడు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం, అందరినీ అనుమానించడం అతని నైజం. ఈ క్రమంలో తన స్నేహితుడు అనంతు డిప్రెషన్‌లో ఉన్నానని, కాశ్మీర్‌లో ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్ చేస్తాడు. దాంతో సన్నీ, రమ్య అనే అమ్మాయిని ఇష్టపడే వర్మ (ప్రిన్స్) సహాయంతో కాశ్మీర్‌ బయలుదేరుతాడు. అక్కడ కన్య (మెరిన్ ఫిలిప్) పరిచయమవ్వడం, అనుకోకుండా వర్మ హత్యకు గురికావడం, రీల్స్ చేయడానికి పిచ్చిగా ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ వాసు (అజయ్) ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. వీరందరి మధ్య సంబంధం ఏమిటి? ఈ చిక్కుముడిని సన్నీ ఎలా విప్పాడు? అనేదే ఈ చిత్ర అసలు కథ.

విశ్లేషణ
దర్శకుడు విమల్ కృష్ణ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. ప్రతి చిన్న విషయానికి అనుమానపడే హీరో పాత్ర చుట్టూ తిరిగే సన్నివేశాలు విభిన్నంగా నవ్విస్తాయి. ప్రథమార్ధంలో హీరో చేసే అల్లరి, సిచ్యుయేషనల్ కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ద్వితీయార్ధంలో అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన హంగామా, రీల్స్ కాన్సెప్ట్ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సరదాగా సాగుతాయి. స్క్రీన్‌ప్లేలో సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తాయి.

నటీనటుల ప్రతిభ
లీడ్ రోల్ చేసిన రాగ్ మ‌యూర్‌ తన అనుమానాలతో కూడిన పాత్రలో చాలా సహజంగా నటించాడు. మంచి టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. తెలుగు తెరకు పరిచయమైన మెరిన్ ఫిలిప్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. ప్రిన్స్, అజయ్ తమ పాత్రల పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.

సాంకేతిక నిపుణులు
సాంకేతికంగా సినిమా రిచ్‌గా ఉంది. కాశ్మీర్ అందాలను సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా క్యాప్చర్ చేసింది. నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కు సరిగ్గా సరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివ‌రిగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ‘అనుమాన పక్షి’ మంచి ఛాయిస్ అవుతుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← NIMAS | 23 రోజుల్లో ఎవరూ ఎక్కని 20 శిఖరాల అధిరోహణCEO Sudarshan Reddy | ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి : సీఈవో సుదర్శన్ రెడ్డి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com