☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

NIMAS | 23 రోజుల్లో ఎవరూ ఎక్కని 20 శిఖరాల అధిరోహణ

NIMAS | ఎన్‌ఐఎంఏఎస్‌ బృందం 23 రోజుల్లో ఇంతకుముందు ఎవరూ ఎక్కని 20 పర్వత శిఖరాలను అధిరోహించింది. పర్వతారోహణలో ఒక మైలురాయిని చేరింది. ఈ బృందాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు.
NIMAS | 23 రోజుల్లో ఎవరూ ఎక్కని 20 శిఖరాల అధిరోహణ

NIMAS | దిరాంగ్‌ (Dirang)లోని 20 మంది సభ్యులు గల నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ అండ్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ (MIMAS) బృందం ఒక మైలురాయిని చేరింది. ఈ బృందం లడఖ్‌లోని ఒక్కొక్కటి ఆరువేల మీటర్ల పైగా ఎత్తున్న, ఎవరూ ఎక్కని 20 పర్వత శిఖరాలను 23 రోజుల్లో అధిరోహించారు. లడఖ్‌ పర్వత శ్రేణిలోని చమ్సర్‌-లుంగ్సర్‌, గ్యామా నాలా, చోకులా ప్రాంతాల్లో ఉన్న వీటిని ఇంతకుముందు ఎవరూ అధిరోహించలేదు. ఈ బృందానికి కల్నల్‌ రణ్‌వీర్‌ సింగ్‌ జమ్వాల్‌ నాయకత్వం వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం ఈ బృందాన్ని ప్రశంసించారు.

అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో పర్వతారోహణ, సాహ క్రీడల్లో భారతదేశ సామర్థ్యాలను నిరూపించేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. భవిష్యత్‌ తరాలకు పర్వతారోహణపై స్ఫూర్తినిచ్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఈ బృంద పర్వతారోహణ ముగింపు కార్యక్రమానికి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు రక్షణ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ కూడా హాజరయ్యారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← West Indies | భారత గడ్డపై విండీస్ చెత్తాట.. 24 ఏళ్లలో ఒక్క వన్డే సిరీస్ గెలవలే..!Anumana Pakshi | ‘అనుమాన పక్షి’ రివ్యూ.. విమల్ కృష్ణ టేకింగ్, రాగ్ మ‌యూర్‌ నటన ఎలా ఉంది! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com