☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Uttar Pradesh: రోప్ స్కిప్పింగ్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాలు గెలిచింది.. 12వ అంత‌స్తు నుంచి కిందప‌డి యువ‌తి మృతి

Uttar Pradesh: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌కు చెందిన 9వ త‌ర‌గ‌తి విద్యార్థిని.. 12వ అంత‌స్తు నుంచి కింద‌ప‌డి మృతిచెందింది. బాల్క‌నీలో ఆరేసిన దుస్తుల్ని తెచ్చేందుకు వెళ్లి ఆమె బిల్డింగ్ మీద నుంచి ప‌డి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని 14 ఏళ్ల ప్రాచీగా గుర్తించారు. గ‌త వార‌మే ఆమె రోప్ స్కిప్పింగ్ ఈవెంట్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాలు గెలుచుకున్న‌ది.
Uttar Pradesh: రోప్ స్కిప్పింగ్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాలు గెలిచింది.. 12వ అంత‌స్తు నుంచి కిందప‌డి యువ‌తి మృతి

ఘ‌జియాబాద్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(Uttar Pradesh)లోని ఘ‌జియాబాద్‌కు చెందిన 9వ త‌ర‌గ‌తి విద్యార్థిని.. 12వ అంత‌స్తు నుంచి కింద‌ప‌డి మృతిచెందింది. బాల్క‌నీలో ఆరేసిన దుస్తుల్ని తెచ్చేందుకు వెళ్లి ఆమె బిల్డింగ్ మీద నుంచి ప‌డి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని 14 ఏళ్ల ప్రాచీగా గుర్తించారు. రాజ్ న‌గ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌లో నివాసం ఉంటున్న ఆ అమ్మాయి.. సంజ‌య్ న‌గ‌ర్‌లోని డెహ్రాడూన్ ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దువుతోంది. రాజ్‌న‌గ‌ర్ రెసిడెన్సీ సొసైటీలోని ట‌వ‌ర్ జీ వ‌ద్ద రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ప్రాచీ బిల్డింగ్ నుంచి కింద ప‌డింది. స్థానికులు అమ్మాయిని స‌మీపంలోని య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ ఆమె అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. మృతికి చెందిన కార‌ణాల‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీంతో పోస్టు మార్ట‌మ్ నిర్వ‌హిస్తున్నారు.

నంద్‌గ్రామ్ పోలీసులు సీసీటీవీ దృశ్యాల‌ను ప‌రిశీలిస్తున్నారు. ప్రాచీ రెండు రోజుల క్రిత‌మే షిర్డి నుంచి ఇంటికి తిరిగి వ‌చ్చింది. సీబీఎస్ఈ రోప్ స్కిప్పింగ్ జాతీయ పోటీల్లో పాల్గొని రెండు స్వ‌ర్ణ ప‌త‌కాల‌ను ఆమె గెలుచుకున్న‌ది. డ‌బుల్ డ‌చ్ పెయిర్ ఫ్రీ స్టైయిల్‌, డ‌బుల్ డ‌చ్ సింగిల్ ఫ్రీ స్టైయిల్ కేట‌గిరీల్లో ఆమె మెడ‌ల్స్ సాధించింది. అయితే విక్ట‌రీ సెల‌బ్రేష‌న్ మూడ్‌లో ఉండ‌గా.. ఈ ఘ‌ట‌న ఆ ఫ్యామిలీలో విషాదాన్ని నింపింది. ప్రాచీ తండ్రి సురేశ్ చాంద్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ప్రాచీ పేరెంట్స్‌, సోద‌రి, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇంట్లో ఉన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← NarayaNamma | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు కొత్త డేట్.. రేపే ‘నారాయణమ్మ’ సందడి!శ్రీరంగనాథ స్వామి ఆలయంలో చోరీ.. రాములవారి గుడిలో పంచలోహ విగ్రహాలు మాయం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com