☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Woman Raped On Pretext Of Job | ఉద్యోగం పేరుతో మహిళను రప్పించి.. మత్తు మందు ఇచ్చి వ్యక్తి అత్యాచారం

Woman Raped On Pretext Of Job | ఒక వ్యక్తి మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్దకు రప్పించుకున్నాడు. మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో రికార్డ్‌ చేసి బాధితురాలిని బెదిరించాడు. ఆ వ్యక్తి వేధింపులు భరించలేని ఆ మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Woman Raped On Pretext Of Job | ఉద్యోగం పేరుతో మహిళను రప్పించి.. మత్తు మందు ఇచ్చి వ్యక్తి అత్యాచారం

న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్దకు రప్పించుకున్నాడు. మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో రికార్డ్‌ చేసి బాధితురాలిని బెదిరించాడు. ఆ వ్యక్తి వేధింపులు భరించలేని ఆ మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Woman Raped On Pretext Of Job) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన 41 ఏళ్ల మహిళకు, గణేష్ నగర్‌కు చెందిన దీపక్ బన్సాల్ అనే వ్యక్తి రెండేళ్ల కింద పరిచయమయ్యాడు. ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేస్తానని అతడు హామీ ఇచ్చాడు.

కాగా, మార్చి 4న ఉద్యోగ విషయమై మాట్లాడాలనే సాకుతో మండావళి ప్రాంతంలో ఆ మహిళను దీపక్‌ కలిశాడు. ఆ సమయంలో మత్తు పదార్థాన్ని ఆమెకు ఇచ్చాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ మహిళపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను వీడియా రికార్డ్‌ చేశారు. స్పృహ వచ్చిన తర్వాత ఆ మహిళను బెదిరించాడు. ఆమె బంగారు గాజులు, ఉంగరం, గొలుసు కూడా తీసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. పోలీసు శాఖలో తనకు పరిచయాలు ఉన్నాయని అతడు చెప్పాడు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఆమెపై యాసిడ్ పోస్తానని అతడు బెదిరించాడు.

మరోవైపు భయం కారణంగా ఆ మహిళ కొన్ని నెలల పాటు మౌనంగా ఉన్నది. అయితే దీపక్‌ నిరంతరం వేధించడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. బాధిత మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Heart Health | గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ర‌న్నింగ్ వ‌ర్సెస్ బాడీవెయిట్‌ స్క్వాట్స్‌.. ఏవి ఉత్త‌మం..?Kazipet | కాజీపేటలో దారుణం..అక్రమ సంబంధం వద్దంటూ తల్లిని చంపిన తనయుడు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com