☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Kazipet | కాజీపేటలో దారుణం..అక్రమ సంబంధం వద్దంటూ తల్లిని చంపిన తనయుడు

Kazipet | అక్రమ సంబంధం వద్దంటూ ఓ కన్న తల్లిని కొడుకు గొంతుకోసి దారుణంగా హత్య చేసిన సంఘటన కాజీపేట పట్టణం బాలాజీనగర్ లో గురువారం చోటు చేసుకుంది.
Kazipet | కాజీపేటలో దారుణం..అక్రమ సంబంధం వద్దంటూ తల్లిని చంపిన తనయుడు

కాజీపేట : అక్రమ సంబంధం ( Illicit affair ) వద్దంటూ ఓ కన్న తల్లిని కొడుకు గొంతుకోసి దారుణంగా హత్య ( Murder ) చేసిన సంఘటన కాజీపేట ( Kazipet ) పట్టణం బాలాజీనగర్ లో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగుల సుధాకర్,ఉదయశ్రీ 20 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వీరితో పాటు సుధాకర్‌ తల్లి బాలాజీనగర్‌లో నివసిస్తున్నారు.

సుధాకర్‌ ప్రైవేట్‌ కంపెనీలో అటెండర్‌గా పనిచేస్తుండగా భార్య ఉదయశ్రీ ఇన్‌స్ట్రాగ్రామ్‌ లో రీల్స్‌ చేస్తు వస్తుంది. ఈ దశలో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. వీరిద్దరు వేరే కాపురం పెట్టుకునేందుకు ఆలోచిస్తున్న తరుణంలో ఉదయశ్రీ ఇంట్లో వాళ్లకు చెప్పి గురువారం బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది.

ఈ విషయం తెలుసుకున్న కుమారుడు దొరబాబు తల్లిని బెడ్‌రూంలోకి తీసుకెళ్లి అక్రమ సంబంధం వద్దంటూ నచ్చచెప్పేందుకు యత్నించాడు. అయితే తల్లి ససేమిరా అనడంతో కోపంతో ఆమె గొంతు కోసి చంపి పారిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సెంట్రల్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి, సీఐ శ్యాం సుందర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Woman Raped On Pretext Of Job | ఉద్యోగం పేరుతో మహిళను రప్పించి.. మత్తు మందు ఇచ్చి వ్యక్తి అత్యాచారంBrazil Coach | భారత్‌లో ఫుట్‌బాల్ సంస్కృతి లేదు.. మమల్ని ఎదుర్కొనే అనుభవమూ లేదు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com