☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Bihar: ప‌ర్యాట‌క కేంద్రం వ‌ద్ద అమ్మాయికి వేధింపులు.. బీహార్‌లో మ‌రో ఘ‌ట‌న‌.. ఆరుగురిపై కేసు

Bihar: బీహార్‌లోని మందార ప‌ర్వ‌తంపై.. ఓ మ‌హిళ‌ను ఆక‌తాయిలు వేధించారు. బంకా జిల్లాలో ఉన్న ప్ర‌ఖ్యాత టూరిస్టు సైట్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆరుగురు యువ‌కుల‌పై కేసు న‌మోదు చేశారు.
Bihar: ప‌ర్యాట‌క కేంద్రం వ‌ద్ద అమ్మాయికి వేధింపులు.. బీహార్‌లో మ‌రో ఘ‌ట‌న‌.. ఆరుగురిపై కేసు

న్యూఢిల్లీ: బీహార్‌(Bihar)లోని మందార ప‌ర్వ‌తంపై.. ఓ మ‌హిళ‌ను ఆక‌తాయిలు వేధించారు. బంకా జిల్లాలో ఉన్న ప్ర‌ఖ్యాత టూరిస్టు సైట్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆరుగురు యువ‌కుల‌పై కేసు న‌మోదు చేశారు. సెప్టెంబ‌ర్ 3వ తేదీన ఓ అమ్మాయిని వేధించిన‌ట్లు వీడియో ద్వారా తెలిసింది. ఆ మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఆ గ్యాంగ్‌.. ఆమెను చెప్పుతో కొట్టారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సెప్టెంబ‌ర్ 22వ తేదీన పోలీసుల‌కు చిక్కింది. సోష‌ల్ మీడియా సెల్ ద్వారా ఆ వీడియో గురించి తెలుసుకున్నారు.

బౌన్సీ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో కేసు బుక్ చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బౌన్సీ స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ పంక‌జ్ కుమార్ జా వాట్సాప్ నెంబ‌ర్‌కు వీడియో ఫార్వ‌ర్డ్ అయ్యింది. అయితే ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ఎస్‌హెచ్‌వో విజిట్ చేశారు. అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న కింద ఆరుగుర్ని అనుమానిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు. వీడియోలో ఉన్న మ‌హిళ‌, అబ్బాయి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మందార హిల్ స‌మీపంలో గాలింపు ముమ్మ‌రం చేశారు.

నిందితుల‌ను ప‌ట్టుకున్న త‌ర్వాత చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెప్పారు. ఇటీవ‌ల బీహార్‌లో రెండు వేధింపుల ఘ‌ట‌న‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. జాముయి, స‌మ‌స్తిపుర్‌లో కూడా అమ్మాయిని ఆక‌తాయిలు వేధించిన విష‌యం తెలిసిందే.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Maoist letter | తూప్రాన్‌లో మావోయిస్టు లేఖ కలకలం.. ఇద్దరు అరెస్ట్‌Alia Bhatt | కసిగా మంట పెట్టేలా.. గుండెల్లో ప్రేమను నింపేలా.. ఆలియా భట్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ అదుర్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com