Alia Bhatt’s First Look from Love & War | బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ (Love & War) సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ఆలియా భట్ ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఆగ్ భీ, దిల్ కీ జాన్ భీ!(కసిగా మంట పెట్టేలా.. గుండెల్లో ప్రేమను నింపేలా) అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, వికీ కౌశల్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్ల కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఈ భారీ బడ్జెట్ రొమాంటిక్ డ్రామా సినిమాను 2027 జనవరి 21న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో కలుద్దాం! అంటూ చిత్ర బృందం ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
Aag bhi, dilon ki jaan bhi!
Sanjay Leela Bhansali’s Love & War on 21st January 2027
See you at the movies!
#LoveAndWar@saregamaglobal #RanbirKapoor @vickykaushal09 @aliaa08 #PrernaSingh pic.twitter.com/vv7aP0O6hL
— BhansaliProductions (@bhansali_produc) September 25, 2026









