ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. 2026 అక్టోబర్ 17 (శనివారం) ఉదయం బస్సులో గోతిలో పడింది. రాజస్థాన్ లోని కోటాలో జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే దుర్మణం చెందారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
భోపాల్ నుంచి ఖటు శ్యామ్ కు ప్యాసెంజర్లతో వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. గాయపడిన వారికి ఎంబీఎస్ ఆసుపత్రి, న్యూ మెడికల్ కాలేజీలలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
చనిపోయిన వారిలో ఐదు మంది మహిళలు ఉన్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం ఉదయం 8 గంటలకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే స్థానికులు గాయపడిన వారినీ, మృతులను ఆసుపత్రికి చేర్చినట్లు చెప్పారు.
భోపాల్ నుంచి ఖటు శ్యామ్ వెళ్తున్న బస్సులో ప్రమాద సమయంలో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ కునుకు తీయడంతో రెప్ప పాటులో బస్సు అదుపుతప్పి గోతిలో పడిపోయినట్లు తెలిపారు. మొదట రేలింగ్ ను ఢీకొని.. ఆ తర్వాత గోతిలో పడిపోయినట్లు తెలిపారు.


